Sanjay Dutt: సౌత్ ఇండస్ట్రీలో సంజయ్ దత్ హవా.. ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం రెమ్యునరేషన్ ఎంతంటే..
హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీని తీసుకురాబోతున్నారు పూరీ. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఇందులో నటించేందుకు సంజయ్ దత్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వార్త వైరలవుతుంది. ఈ సినిమా కోసం భారీగానే ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల స్కంద సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు హీరో రామ్ పోతినేని. డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ప్రస్తుతం రామ్ డబుల్ ఇస్మార్ట్ కోసం సిద్ధమవుతున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీని తీసుకురాబోతున్నారు పూరీ. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఇందులో నటించేందుకు సంజయ్ దత్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వార్త వైరలవుతుంది. ఈ సినిమా కోసం భారీగానే ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఏకంగా రూ.6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత సంజయ్ దత్ మార్కెట్ పెరిగిందన్న సంగతి తెలిసిందే. ఇటు సౌత్ ఇండస్ట్రీలో ఆయనకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే సంజయ్ దత రెమ్యునరేషన్ సైతం పెంచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.
To the craftsman who redefined MASS CINEMA in his own style💥
Team #DoubleISMART wishes our Sensational Director #PuriJagannadh a Blockbuster Birthday 🔥#HBDPuriJagannadh ❤️🔥
Ustaad @ramsayz @duttsanjay @IamVishuReddy @PuriConnects pic.twitter.com/ovFPG7rJGj
— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2023
ఇదిలా ఉంటే.. డబుల్ ఇస్మార్ట్ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో మరోసారి రామ్ మాస్ యాక్షన్ హీరోగా రగ్గడ్ లుక్లో కనిపించనున్నారు. ఇటీవలే సెట్స్ లో రామ్ సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోను షేర్ చేసింది నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్. అందులో రామ్ లుక్ చూస్తుంటే మరోసారి రగ్గడ్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుండగా.. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
He is BACK!
Ustaad @ramsayz from sets of #DoubleISMART ❤️🔥
The shoot is currently progressing in Mumbai & some crucial sequences are being shot💥
IN CINEMAS MARCH 8th,2024🔥#RAmPOthineni #PuriJagannadh @duttsanjay @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/wFzfRiA0gY
— Puri Connects (@PuriConnects) November 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
