మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత కొన్ని నెలలుగా సినిమాలకు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన కూతురి క్లింకారాతో సమయం కేటాయిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో చరణ్ తిరిగి షూటింగ్స్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ మెగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఓ వీడియో షేర్ చేశారు. చరణ్, రణ్వీర్ కలిసి ఓ మూవీ చేసినట్లుగా ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ వీడియోలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ కనిపిస్తుంది. ఆ తర్వాత రణ్వీర్, సార్ టార్గెట్ కనిపించింది అని చెబుతాడు. ఇక ఆ తర్వాతి సీన్లో ఒక ఆఫీసర్ తో రామ్ చరణ్ తో.. ఏజెంట్ గో గో అంటుండగా.. చరణ్ పరిగెత్తడం చూడొచ్చు.
చివరిగా అందులో పోలీస్ స్టేషన్లో త్రిష కూడా కనిపించింది. ఈ పోస్ట్ కు సీక్రెట్ ను బయటపెడదాం అంటూ రాసుకొచ్చారు రణ్వీర్. బిగ్ సర్పైజ్ త్వరలోనే రాబోతుందంటూ చెప్పేశాడు రణ్వీర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. అసలు ఇదేప్పుడు చేశారు ?.. చరణ్, రణ్వీర్ కాంబోలో మూవీ రాబోతుందా ?.. అంటూ ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ, అంజలి కీలకపాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి అతిథిగా రణ్వీర్ రాగా.. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోస్ అప్పట్లో తెగ వైరలయ్యాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందా ?.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.