AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bobby Deol: అప్పుడు రణ్ బీర్.. ఇప్పుడు అలియా.. విలన్‌గా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన బాబీ డియోల్..

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిపోయాడు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లకు భారీ పోటీ ఇచ్చాడు. కానీ కాలక్రమేణా అతని క్రేజ్ తగ్గిపోయింది. సినిమా అవకాశాలను కోల్పోయి సినీ పరిశ్రమకు దూరంగా ఉండిపోయాడు. అయితే ఇప్పుడు విలన్ గా అదరగొడుతున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

Bobby Deol: అప్పుడు రణ్ బీర్.. ఇప్పుడు అలియా.. విలన్‌గా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన బాబీ డియోల్..
Bobby Deol, Alia Bhatt
Basha Shek
|

Updated on: Mar 29, 2024 | 7:21 AM

Share

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిపోయాడు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లకు భారీ పోటీ ఇచ్చాడు. కానీ కాలక్రమేణా అతని క్రేజ్ తగ్గిపోయింది. సినిమా అవకాశాలను కోల్పోయి సినీ పరిశ్రమకు దూరంగా ఉండిపోయాడు. అయితే ఇప్పుడు విలన్ గా అదరగొడుతున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ విలన్ బాబీ డియోల్ అని అన్నా అతిశయోక్తి కాదు. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’లో విలన్‌గా మెరిశాడు. ఇందులో బాబీ డియోల్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రణబీర్‌కి విలన్‌గా నటించిన బాబీ డియోల్ ఇప్పుడు రణబీర్ కపూర్ భార్య అలియా భట్‌కి విలన్‌గా మారారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ కొత్త స్పై సిరీస్ మూవీలో బాబీ డియోల్ విలన్‌గా నటించనున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ ఇప్పటికే ‘టైగర్’, ‘వార్’, ‘పఠాన్’ సినిమాల ద్వారా ‘స్పై వెర్స్’ని రూపొందించింది. ఇప్పుడు ఓ మహిళా గూఢచారిని పరిచయం చేస్తూ అలియా భట్‌తో గూఢచారి సినిమా చేయబోతున్నారు.

అలియా భట్, శర్వరీ వాగ్ జంటగా నటిస్తున్న కొత్త గూఢచారి సినిమాలో బాబీ డియోల్ విలన్‌ గా నటించనున్నాడు. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభం కానుందని సమాచారం. బాబీ డియోల్ ప్రస్తుతం తమిళ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువ’లో విలన్‌గా నటిస్తున్నాడు. దీంతో పాటు తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రంలో కూడా విలన్‌గా నటిస్తున్నాడు. చారిత్రక కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది కాకుండా నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంలో విలన్‌గా కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి

కంగువా సినిమాలో బాబీ డియోల్..

రణ్ బీర్ కపూర్ యానిమల్ సినిమాలో బాబీ డియోల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!
పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!
తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు
తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు
25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..
25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..
జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..
జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..
మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!
మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!
రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!
రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!
బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్
బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్
మాజీ ప్రియుడి వేధింపులు.. కాపురం కూల్చిన అశ్లీల ఫొటోలు
మాజీ ప్రియుడి వేధింపులు.. కాపురం కూల్చిన అశ్లీల ఫొటోలు
బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో
బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో
హాంకాంగ్ సిక్సెస్‌కు టీమిండియా.. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్
హాంకాంగ్ సిక్సెస్‌కు టీమిండియా.. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్