Gold Prices: డిసెంబర్ చివరి నాటికి బంగారం ధరలు తలక్రిందులు.. ఎంతకు చేరుకుంటాయంటే..? ఊహించని లెక్కలు..
బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత తగ్గనున్నాయా? అంటే అవుననే అంటోంది ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని అంటోంది. ఇదే జరిగితే దేశంలో బంగారం ధరలు పడిపోయే అవకాశముంది.

అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల క్రమంలో బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశముందనే మాటలు నిపుణుల నోట వెంట వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థల నివేదికల రూపంలో తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. జేపీ మోర్గాన్ సంస్థ బంగారం ధరలు పెరుగుతాయని అభిప్రాయపడగా.. తాజాగా గోల్డ్ మన్ సాచ్స్ సంస్థ భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. గోల్డ్ ధరలు మరింత తగ్గుతాయని చెబుతోంది. 2027 డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఔన్స్‌కు 4,650 యూఎస్ డాలర్లకు చేరుకునే అవకాశముందని అంచనా వేసింది. గతంలో 4800 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేయగా.. ఇప్పుడు అంచనాలు మరింత తగ్గించింది.
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు
అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను రాబోయే రోజుల్లో మరింత పెంచవచ్చని ఆర్ధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌లో 25 బేసిస్ పాయింట్లను పెంచే అవకాశముందని చెబుతుండగా.. 2027 మార్చిలో మరో 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ తన నివేదికలో పేర్కొంది. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే ఎలాంటి వడ్డీ ఆదాయాన్ని ఇవ్వని బంగారంలో పెట్టుబడులు తగ్గుతాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టినవారు బంగారం నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని అధిక వడ్డీని అందించే ప్రభుత్వ బాండ్లలోకి తరలించే అవకాశముంది. దీని వల్ల రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తోంది. ఫెడ్ వడ్డీ రేట్లు, అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
బలాన్ని ఇస్తున్న కేంద్ర బ్యాంకులు
బంగారం ధరలు పడిపోతున్నా అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు మాత్రమే పసిడిని కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణంపై భయం నెలకొన్న క్రమంలో బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. చైనాతో పాటు పలు దేశాల బ్యాంకులు గోల్డ్‌ను భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది బంగారం ధరలకు కాస్త బలాన్ని ఇస్తుంది. అయితే 2027 చివరిలో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే మళ్లీ బంగారానికి ఆకర్షణ పెరిగే ఛాన్సుంది. దీంతో పెట్టుబడులు పుంజుకుని ఔన్సుకు 4650 డాలర్ల స్థాయికి బంగారం ధరలు చేరుకునే అవకాశముందని నిపుణుల అంచనా. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, డాలర్ మరింత బలపడటం వంటివి చోటుచేసుకుంటే బంగారం ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు ఉండొచ్చంటున్నారు. ఇవన్నీ చోటుచేసుకుంటే భారత మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.20 లక్షలకు దిగివచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం పసిడి ధరలు దిగిస్తున్నాయి. గత వారంలో ఏకంగా రూ.6 వేల వరకు తగ్గింది. రానున్న రోజుల్లో ఇదే పతనం కొనసాగడం బంగారం ధరలు మరింత చౌకగా లభించే అవకాశముంది.
