Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bobby Deol: బాబీ డియోల్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా..? స్టార్ హీరోలందరికి ఇతనే విలన్

హీరోను ఎలివేట్ చెయ్యాలంటే ఆ సినిమాలో విలన్ అంత పవర్ఫుల్ గా ఉండాలి అందుకోసం ఇప్పుడు ఈ ఇద్దరు బాలీవుడ్ నటులను ఎంచుకుంటున్నారు మన టాలీవుడ్ దర్శకులు. 'యానిమల్'తో బాబీ డియోల్ సంచలనం సృష్టించినప్పటి నుంచి అతని పేరు టాలీవుడ్ లో మారుమ్రోగుతుంది. యానిమల్ సినిమా తర్వాత బాబీకి టాలీవుడ్, బాలీవుడ్ లో భారీ ఆఫర్స్ వస్తున్నాయి.

Bobby Deol: బాబీ డియోల్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా..? స్టార్ హీరోలందరికి ఇతనే విలన్
Bobby Deol
Follow us
Rajeev Rayala

|

Updated on: May 16, 2024 | 12:27 PM

బాలీవుడ్ నటులు టాలీవుడ్ లో విలన్స్ గా తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో విలన్ అంటే టక్కున గుర్తొచ్చేది ఇద్దరి పేర్లే అవి సంజయ్ దత్, బాబీ డియోల్.  హీరోల కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న విలన్లు ఈ ఇద్దరూ. హీరోను ఎలివేట్ చెయ్యాలంటే ఆ సినిమాలో విలన్ అంత పవర్ఫుల్ గా ఉండాలి అందుకోసం ఇప్పుడు ఈ ఇద్దరు బాలీవుడ్ నటులను ఎంచుకుంటున్నారు మన టాలీవుడ్ దర్శకులు. ‘యానిమల్’తో బాబీ డియోల్ సంచలనం సృష్టించినప్పటి నుంచి అతని పేరు టాలీవుడ్ లో మారుమ్రోగుతుంది. యానిమల్ సినిమా తర్వాత బాబీకి టాలీవుడ్, బాలీవుడ్ లో భారీ ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో బాబీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.

ఇక కేజీఎఫ్ 2 విజయం తర్వాత సంజయ్ దత్‌ కూడా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ బాబీ డియోల్ ఎంట్రీ తర్వాత, డిమాండ్ కొంచెం తగ్గిందని టాక్ వినిపిస్తుంది. బాబీ డియోల్ ఇంతకు ముందు చాలా సార్లు నెగెటివ్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ, యానిమల్ అతని కెరీర్‌కు మంచి మైలేజ్ ఇచ్చింది. విలన్ పాత్రల్లో సంజయ్ అదరగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు బాబీ డియోల్ విలన్ గా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాబీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ లో  సైఫ్ అలీఖాన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాబీ డియోల్‌కి విలన్‌గా ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఇఅలాగే తమిళ్ లో స్టార్ హీరో సూర్య ‘కంగువ’లోనూ విలన్ గా నటిస్తున్నాడు బాబీ. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది, అందులో ‘ఉధిరన్’ అనే డేంజరస్ లుక్ లో కనిపించాడు బాబీ. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం ‘NBK 109’ లో నటిస్తున్నాడు. ఇటీవలే బాబీ డియోల్ ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు. మరోవైపు, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు సినిమాలో బాబీ డియోల్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. రామ్‌చరణ్, జాన్వీ కపూర్‌ల RC16 లో విలన్ పాత్రను బాబీ డియోల్ ఆఫర్ చేసినట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. అలాగే బాలీవుడ్ లో మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా లైనప్ చేశాడు.

View this post on Instagram

A post shared by Bobby Deol (@iambobbydeol)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో