Kantara Chapter I: కాంతార సినిమా షూటింగ్లో ప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న రిషబ్ శెట్టి..
కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. గతంలో సూపర్ హిట్ అయిన కాంతార చిత్రానికి సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఈమధ్యకాలంలో వరుసగా వార్తలలో నిలుస్తుంది. అంతేకాదు.. కొన్ని రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ సమయంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కాంతార. డైరెక్టర్ కమ్ యాక్టర్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. కొన్ని రోజులుగా భారీ అంచనాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. శివమొగ్గలోని హోసానగర్ లోని మణి రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈ మూవీ టీమ్ త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకుంది. శనివాసం సాయంత్రం 30 మందికి పైగా కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు హీరో రిషబ్ శెట్టి సైతం అందులో ఉన్నారు. పడవ మునిగిపోయిన వెంటనే అందులో ఉన్నవారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో కెమెరాతోపాటు పలు సాంకేతిక పరికరాలు నీటపాలైనట్లు తెలుస్తోంది. హోసానగర్ లోని యాదూర్ రిసార్టుకు కళాకారులు మొత్తం సురక్షితంగా తిరిగి వచ్చారని సమాచారం.
అయితే ఈ ప్రమాదం గురించి శివమొగ్గ పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ సమయంలో ఏం జరిగింది.. ?పడవ మునిగిపోవడానికి గల కారణాలు ఏంటీ? అనేది తెలియరాలేదు. మరోవైపు ఈ ఘటన గురించి చిత్రయూనిట్ సైతం ఎలాంటి విషయాలను వెల్లడించలేదు. కాంతార చాప్టర్ 1 షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వేరు వేరు కారణాలతో ఇప్పటికే ముగ్గురు నటులు మరణించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ మూవీ యాక్టర్ విజు వికే… తీర్థహాళ్లిలోని అగుంబేలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. విజు ఆరోజు షూటింగ్ కోసం తీర్థహళ్లికి వచ్చారు. కాసేపట్లో షూటింగ్ ప్రారంభించాల్సి ఉండగా.. అనుకోకుండా ఛాతిలో నొప్పి రావడంతో విజును స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించగా..అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
కాంతార సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటీ నుంచి ముగ్గురు నటులు మరణించారు. ఈ సినిమాకు రిషభ్ శెట్టి స్వయంగా దర్శకతవం వహిస్తున్నారు. గతేడాది నవంబర్ లో జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వ్యా్న్ కు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మేలో నటుడు కపిల్ ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోగా.. అదే నెలలో నటుడు రాకేశ్ పూజారి గుండెపోటుతో కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..
