Pallavi Prashanth: నేను ఎందుకు బ్రతికున్నానా అనిపించింది.. కన్నీరు మున్నీరైన పల్లవి ప్రశాంత్
బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఎక్కువ రోజులు అక్కడ ఉండలేడు అని అంతా అనుకున్నారు. లోపల మొత్తం ఇండస్ట్రీకి సంబందించిన వారే ఉంటారు.. అక్కడి రాజకీయాలను ప్రశాంత్ తట్టుకోలేక బయటకు వచేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి సంచలనం క్రియేట్ చేశాడు
రైతు బిడ్డగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ గేమ్ షోకు వెళ్ళాలి అన్నా.. సాయం చేయండన్నా అంటూ వీడియోలు షేర్ చేసి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. మొత్తానికి అనుకున్నట్టే బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఎక్కువ రోజులు అక్కడ ఉండలేడు అని అంతా అనుకున్నారు. లోపల మొత్తం ఇండస్ట్రీకి సంబందించిన వారే ఉంటారు.. అక్కడి రాజకీయాలను ప్రశాంత్ తట్టుకోలేక బయటకు వచేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి సంచలనం క్రియేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. చివర్లో అమర్ దీప్ తో పోటీపడి విన్నర్ గా నిలిచాడు పల్లవి ప్రశాంత్.
బిగ్ బాస్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అయితే హైలెట్.. రోడ్డు పై కార్లను, బస్సులను ధ్వంసం చేశారు. దాంతో ఆగ్రహించిన పోలీసులు పల్లవి ప్రశాంత్ పై ఆయన అభిమానుల పై కేసులు నమోదు చేశారు. అదుపులోకి కూడా తీసుకున్నారు. ఆతర్వాత పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాడు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు.
బిగ్ బాస్ ఫినాలే తర్వాత జరిగిన సంఘటనలు తలచుకొని ఎమోషనల్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. ఆ టైం లో నా తండ్రి స్థితిని చూసి ఎందుకు బ్రతికున్నానా అనిపించింది అని కన్నీరు పెట్టుకున్నాడు పల్లవి ప్రశాంత్. తాజాగా ఓ టీవీ షో కు బిగ్ బాస్ టీమ్ హాజరయ్యారు. ఈ షోకు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ వీడియోలో పల్లవి ప్రశాంత్, నయన పావని తమ ఫ్యామిలీని తలుచుకొని ఎమోషనల్ అవ్వడం చూపించారు. పల్లవి ప్రశాంత్ తాను అరెస్ట్ అయిన సమయంలో తన తండ్రి పడిన కష్టాల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ విన్నర్ అయ్యి నాన్న కళ్లలో ఆనందం చూడాలనుకున్నా.. కానీ నేను అరెస్ట్ అయినప్పుడు కోర్టు బయట మా నాన్న పడుకున్న వీడియో చూసి .. ఎందుకు బ్రతికున్నానా అనిపించింది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్.
పల్లవి ప్రశాంత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.