AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhijeet : ’40 ఏళ్ళు దాటిన తరవాత ఆ పని చేయలేరు’..బిగ్ బాస్ అభిజిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఈ సినిమా తర్వాత అభిజిత్ వరుసగా సినిమాలు చేసి హీరోగా రాణిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అభిజిత్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఒకటి రెండు సినిమాలు ఓ వెబ్ సిరీస్ మాత్రమే చేశాడు. ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నాడు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.

Abhijeet : '40 ఏళ్ళు దాటిన తరవాత ఆ పని చేయలేరు'..బిగ్ బాస్ అభిజిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Abijith
Rajeev Rayala
|

Updated on: Feb 01, 2024 | 7:46 AM

Share

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈస్ బ్యూటీఫుల్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కుర్ర హీరో అభిజిత్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు నటీనటులకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత అభిజిత్ వరుసగా సినిమాలు చేసి హీరోగా రాణిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అభిజిత్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఒకటి రెండు సినిమాలు ఓ వెబ్ సిరీస్ మాత్రమే చేశాడు. ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నాడు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. తనదైన గేమ్ తో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాదు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా కూడా నిలిచాడు. దాంతో అభిజిత్ కు మంచి ఫ్యాన్బ్ బేస్ క్రియేట్ అయ్యింది.

బిగ్ బాస్ తర్వాత అయినా సినిమాలతో బిజీ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. బిగ్ బాస్ తర్వాత మనోడు కనిపించిందే లేదు.. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో అభిజిత్ కూడా నటిస్తున్నాడు.

ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “మిస్ పర్ఫెక్ట్” స్ట్రీమింగ్‌ కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిజిత్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ వెబ్ సిరీస్ లో  చాలా లేజీ పర్సన్‌గా కనిపిస్తా.. ఏం పని పాట లేకుండా ఉండే క్యారెక్టర్ కానీ వంట మాత్రం బాగా చేస్తాడు.. ఇలాంటి పాత్ర చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. అలాంటి వారిని నేను చాలా మందిని చూశాను. అలాగే అభిజిత్ మాట్లాడుతూ.. నేను చాలా మందిని చూశాను.. ఉద్యోగం చేయలేక అటు బయటకు వచ్చి బిజినెస్ తో రిస్క్ చేయలేక ఓ సంఘర్షణలో ఉంటుంటారు. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు రిస్క్ చేయాలన్న చేయలేరు. అప్పుడు బాధ్యతలు మరింత పెరుగుతాయి అని తెలిపాడు అభిజిత్. యాక్టర్‌గా నా కెరీర్ విషయంలో మాత్రం సీరియస్ గానే ఉన్నా.. మా అమ్మ మాత్రం పెళ్లి చేసుకోమని గోల చేస్తుంది అని చెప్పుకొచ్చాడు అభిజిత్.

అభిజిత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us