Rakul Preet Singh: మోడీ సూచనతో మారిన రకుల్ ప్రీత్ వెడ్డింగ్ వెన్యూ.. పెళ్లి ఎక్కడంటే
టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా రాణించింది రకుల్ ప్రీత్ సింగ్ . తెలుగులో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు , అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.అలాగే తమిళ్ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోలతో జతకట్టింది.

చాలా మంది హీరోలు హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే చాలా మంది ముదురు భామలు అనే ట్యాగ్ చెరిపేసుకునేందుకు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇక ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్ళికి రెడీ అయ్యింది. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా రాణించింది రకుల్ ప్రీత్ సింగ్ . తెలుగులో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు , అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.అలాగే తమిళ్ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోలతో జతకట్టింది. కెరీర్ లో పీక్స్ చూస్తున్న సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు పెళ్ళికి రెడీ అయ్యింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఈ అమ్మడు ప్రేమలో ఉంది. వీళ్ల ప్రేమ వ్యవహారం చాలా కాలం సీక్రెట్ గా ఉన్నప్పటికీ మీడియా కంట చాల సార్లు కలిసి కనిపించారు. ఇక ఇప్పుడు ఈ జంట పెళ్ళికి రెడీ అయ్యింది. అయితే ఫిబ్రవరిలో వీరి వివాహం గ్రాండ్ గా జరగనుంది.
అయితే వీరి వివాహం గోవుల జరగనుందని తెలుస్తోంది . రకుల్, జాకీ భగ్నానీ డెస్టినేష్ వెడ్డింగ్ గోవాలో జరగడానికి ప్రధాని మోదీనే కారణం అని తెలుస్తోంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ జంట ముందుగా విదేశాల్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే మిడిల్ ఈస్ట్ లో పెళ్లి చేసుకోవాలని రకుల్, జాకీ భగ్నానీ ఫిక్స్ అయ్యారట. అయితే ప్రధాని మోదీ సెలబ్రెటీలు తమ ముఖ్యమైన ఈవెంట్లను ఇండియాలోనే జరుపుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. దాంతో రకుల్, జాకీ పెళ్లి గోవాకు షిఫ్ట్ అయ్యిందని తెలుస్తోంది. మొన్నామధ్య లక్షద్వీప్ వెళ్లి మోదీ చేసిన ఫొటోషూట్ తర్వాత మాల్దీవ్స్ మంత్రులు చేసిన కామెంట్స్ ఇండియన్స్ ను ఉడికించాయి. దాంతో చాలా మంది సెలబ్రెటీస్ మాల్దీవ్స్ వెకేషన్స్ ను రద్దు చేసుకున్నారు. ఇప్పుడు రకుల్,జాకీ కూడా తమ పెళ్లిని గోవాకు షిఫ్ట్ చేసుకున్నారని తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




