Sundeep Kishan - Kumari Aunty: కుమారీ ఆంటీకి అండగా.. టాలీవుడ్ స్టార్ హీరో సందీప్‌ కిషన్‌.

Sundeep Kishan – Kumari Aunty: కుమారీ ఆంటీకి అండగా.. టాలీవుడ్ స్టార్ హీరో సందీప్‌ కిషన్‌.

Anil kumar poka

|

Updated on: Feb 01, 2024 | 8:04 AM

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది కుమారీ ఆంటీ. మాదాపూర్‌లోని ఐటీసీ కోహీనూర్‌ హోటల్‌ సమీపంలో స్ట్రీట్‌ ఫుడ్ బిజినెస్‌ చేస్తోన్న ఆమె గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. కుమారీ ఆంటీ ఫుడ్‌ బిజినెస్‌ రోజుకు లక్షల్లో సాగుతుందని ,సెలబ్రిటీలు కూడా ఆమె దగ్గరికొచ్చి భోజనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలు ఊదరగొట్టేశాయి. ఇక బిగ్‌బాస్‌ రాబోయే సీజన్‌లోనూ కుమారి ఆంటీ కనిపిస్తారంటూ కథనాలు కూడా అల్లేశాయి. […]

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది కుమారీ ఆంటీ. మాదాపూర్‌లోని ఐటీసీ కోహీనూర్‌ హోటల్‌ సమీపంలో స్ట్రీట్‌ ఫుడ్ బిజినెస్‌ చేస్తోన్న ఆమె గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. కుమారీ ఆంటీ ఫుడ్‌ బిజినెస్‌ రోజుకు లక్షల్లో సాగుతుందని ,సెలబ్రిటీలు కూడా ఆమె దగ్గరికొచ్చి భోజనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలు ఊదరగొట్టేశాయి. ఇక బిగ్‌బాస్‌ రాబోయే సీజన్‌లోనూ కుమారి ఆంటీ కనిపిస్తారంటూ కథనాలు కూడా అల్లేశాయి. ఇలా గత కొన్ని రోజులుగా నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్న కుమారీ ఆంటీ ఇప్పుడు కష్టాల్లో పడింది. చుట్టు పక్కల ప్రాంతాల్లోని యువత ఎక్కువగా కుమారీ ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడడంతో రద్దీ ఎక్కువైపోతుంది. ఈ ఫుడ్‌ స్టాల్‌కు వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందంటూ పోలీసులు కుమారీ ఆంటీపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆమె బిజినెస్‌ను క్లోజ్‌చేయించారు. దీనిపై కుమారీ ఆంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. దీంతో టాలీవుడ్‌ స్టార్ హీరో సందీప్‌ కిషన్‌ ఈ విషయం పై రియాక్టయ్యారు. ట్వీట్ చేశారు. సొంతంగా వ్యాపారం చేసి కుటుంబానికి అండగా నిలవాలనుకునే వారికి ఆమె ఆదర్శం అన్న సందీప్ కిషన్.. ఈ మధ్య కాలంలో తాను చూసిన.. బలమైన మహిళా సాధికారితకు ఆమే ఉదాహరణ. తాను.. తన టీమ్‌ తరఫున సాధ్యమైనంతవరకు ఆమెకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తా అని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు సందీప్‌ కిషన్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos