Shruti Haasan: స్వాతంత్య్ర సమరయోధురాలి పాత్రలో శృతిహాసన్
అగ్ర కథానాయిక శృతిహాసన్ పట్టిందల్లా బంగారమవుతోంది. ఈ భామ నటించిన సినిమాలన్నీ విజయం సాధిస్తుండటంతో అదృష్ట నాయిక అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. గత ఏడాది తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్, హాయ్ నాన్న సినిమాలు ఈ అమ్మడికి మంచి విజయాలను అందించాయి. ఈ నేపథ్యంలో కథల ఎంపికలో మరింత వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుందట శృతిహాసన్.
అగ్ర కథానాయిక శృతిహాసన్ పట్టిందల్లా బంగారమవుతోంది. ఈ భామ నటించిన సినిమాలన్నీ విజయం సాధిస్తుండటంతో అదృష్ట నాయిక అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. గత ఏడాది తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్, హాయ్ నాన్న సినిమాలు ఈ అమ్మడికి మంచి విజయాలను అందించాయి. ఈ నేపథ్యంలో కథల ఎంపికలో మరింత వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుందట శృతిహాసన్. తాజా సమాచారం ప్రకారం తమిళంలో ‘వేలు నాచ్చియార్’ అనే వీర వనిత పాత్రలో నటించబోతుందట. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ధీర వనితగా తమిళనాట వేలు నాచ్చియార్ ప్రసిద్ధికెక్కింది. కథలోని దేశభక్తి అంశాలు, తన పాత్రలోని ధీరత్వం నచ్చడంతో ఈ సినిమాకు శృతిహాసన్ ఓకే చెప్పిందని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్‌లోనే కనిపించిన ఈ అమ్మడు తొలిసారి స్వాతంత్య్ర పోరాట నేపథ్య కథలో నటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మాతృభాష తమిళంలో శృతిహాసన్ నటించబోతున్న చిత్రమిదే కావడం విశేషం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచ అత్యంత సంపన్నుడుగా బెర్నార్డ్ ఆర్నాల్ట్ !! రెండో స్థానం లో ఎలాన్ మస్క్
అతి పెద్ద క్రూజ్ నౌకకు పేరు పెట్టిన ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ
గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్‌కు బదులు నీళ్లు !! ఎక్కడంటే ??
కెమెరాకు చిక్కిన అరుదైన గోల్డెన్ టైగర్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

