పట్టపగలు చోరీ చేయడం ఇంత ఈజీనా !! నెట్టింట వీడియో వైరల్
బంగారం షాపులోకి వచ్చాడు.... నచ్చిన చెవి కమ్మలు అడిగి తీసుకున్నాడు.... చేతితో పట్టుకుని చూశాడు.. బాగనే గిట్టుబాటు అవుతుంది అనుకున్నాడు. అంతే.. ఒక్క ఉదుటన షాపులోంచి బయటపడ్డాడు. షాపు యజమాని ఏంజరిగిందో తెలుసుకునేలోపు మెరుపుతీగలా మాయమైపోయాడు ఆదొంగ. రాయదుర్గం పట్టణంలో ఓ జ్యువెలరీ షాపులో జరిగిన ఈ దొంగతనాన్ని సీసీ కెమెరాలో చూసిన వారంతా షాకవుతున్నారు.
బంగారం షాపులోకి వచ్చాడు…. నచ్చిన చెవి కమ్మలు అడిగి తీసుకున్నాడు…. చేతితో పట్టుకుని చూశాడు.. బాగనే గిట్టుబాటు అవుతుంది అనుకున్నాడు. అంతే.. ఒక్క ఉదుటన షాపులోంచి బయటపడ్డాడు. షాపు యజమాని ఏంజరిగిందో తెలుసుకునేలోపు మెరుపుతీగలా మాయమైపోయాడు ఆదొంగ. రాయదుర్గం పట్టణంలో ఓ జ్యువెలరీ షాపులో జరిగిన ఈ దొంగతనాన్ని సీసీ కెమెరాలో చూసిన వారంతా షాకవుతున్నారు. అనంతపురం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే దుకాణదారులను మాటల్లో పెట్టి చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా రద్దీ లేని ఓ బంగారం షాపులో వృద్ధుడు ఒక్కడే కౌంటర్లో కూర్చుని ఉండటం గమనించిన దొంగ ఇదే సరైన సమయం అనుకున్నాడు. కస్టమర్‌లాగా షాపు లోపలికి వెళ్ళాడు.. చెవి కమ్మలు కావాలని షాపు నిర్వాహకుని అడిగి నాలుగైదు రకాల చెవి కమ్మలను చూశాడు…. నచ్చింది తీసుకున్నాడు. ఇంతలో యజమానికి ఏదో ఫోన్ కాల్ రావడంతో అతను ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇదే అదనుగా భావించిన దొంగ అటు… ఇటు చూసి పరుగులంకించుకున్నాడు. షాపు యజమాని తేరుకొని తీరిగ్గా షాపు బయటకు వచ్చి చెప్పులేసుకుని వెళ్లే లోపు దొంగ కంటికి కూడా కనిపించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలరాముడి విగ్రహ శిల వెనుక కన్నీటి గాథ.. భగవంతుని లీల అంటున్న కాంట్రాక్టర్
మద్దిచెట్టులో వినాయకుని రూపం..వింతను చూసేందుకు క్యూగట్టిన జనం
రామాలయంలో అద్భుతం.. శివలింగంపై నాగుపాము ప్రత్యేక్షం
మితిమీరిన ఉత్సాహం జైలుకు పంపింది.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
చేతి స్పర్శను కోల్పోయి ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. డాక్టర్లు స్కాన్ చేయగా మైండ్ బ్లాంక్
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

