మితిమీరిన ఉత్సాహం జైలుకు పంపింది.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
హైదరాబాద్ వేదికగా ఫస్ట్ టెస్టు మ్యాచ్‌లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఫ్యాన్ సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి గ్రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్ళు మొక్కాడు. హిట్ మ్యాన్ వద్దు అని వారిస్తున్నప్పటికీ, అతడు మాత్రం వినిపించుకోలేదు. వెంటనే అప్రమత్తమైన.. గ్రౌండ్ సెక్యూరిటీ అతగాడిని బయటకు తీసుకు వెళ్లారు.
హైదరాబాద్ వేదికగా ఫస్ట్ టెస్టు మ్యాచ్‌లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఫ్యాన్ సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి గ్రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్ళు మొక్కాడు. హిట్ మ్యాన్ వద్దు అని వారిస్తున్నప్పటికీ, అతడు మాత్రం వినిపించుకోలేదు. వెంటనే అప్రమత్తమైన.. గ్రౌండ్ సెక్యూరిటీ అతగాడిని బయటకు తీసుకు వెళ్లారు. ఈ ఘటనను రాచకొండ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. గ్రౌండ్‌లోని దూసుకెళ్లిన యువకుడ్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన హర్షిత్ రెడ్డిగా గుర్తించారు. హర్షిత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు.. న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ వీక్షించే ప్రేక్షకులు.. అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేతి స్పర్శను కోల్పోయి ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. డాక్టర్లు స్కాన్ చేయగా మైండ్ బ్లాంక్