రామాలయంలో అద్భుతం.. శివలింగంపై నాగుపాము ప్రత్యేక్షం
కరీంనగర్ జిల్లాలోని రామాలయంలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. స్థానిక రామాలయంలోని ఉపాలయంలో ఉన్న శివలింగంపై నాగుపాము ప్రత్యక్షమైంది. పరమశివుని మెడలో హారంగా ఉండే నాగరాజు శివుని దర్శనార్ధమై వచ్చి లింగరూపుడైన తన స్వామిని సేవించేందుకే వచ్చాడా అన్నట్టుగా ఆ నాగుపాము శివలింగానికి చుట్టుకొని పడగవిప్పి భక్తులందరికీ దర్శనం ఇచ్చింది. ఈ విచిత్ర సంఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని శివుని దర్శించుకుని పూజలు చేశారు.
కరీంనగర్ జిల్లాలోని రామాలయంలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. స్థానిక రామాలయంలోని ఉపాలయంలో ఉన్న శివలింగంపై నాగుపాము ప్రత్యక్షమైంది. పరమశివుని మెడలో హారంగా ఉండే నాగరాజు శివుని దర్శనార్ధమై వచ్చి లింగరూపుడైన తన స్వామిని సేవించేందుకే వచ్చాడా అన్నట్టుగా ఆ నాగుపాము శివలింగానికి చుట్టుకొని పడగవిప్పి భక్తులందరికీ దర్శనం ఇచ్చింది. ఈ విచిత్ర సంఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని శివుని దర్శించుకుని పూజలు చేశారు. హుజురాబాద్ పట్టణంలోని రామయ్య సన్నిధిలో వెలిసిన శివయ్య పానవట్టంపై నాగుపాము దర్శనం భక్తులను మంత్రముగ్దులను చేసింది. గరళ కంఠుని కంఠాభారణంగా ఉండే నాగరాజు హఠాత్తుగా శివలింగాన్ని చుట్టుకుని కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. పురాతనమైన ఈ ఆలయంలో నిత్యం భక్తుల రాకపోకలతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మితిమీరిన ఉత్సాహం జైలుకు పంపింది.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
చేతి స్పర్శను కోల్పోయి ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. డాక్టర్లు స్కాన్ చేయగా మైండ్ బ్లాంక్
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

