బాలరాముడి విగ్రహ శిల వెనుక కన్నీటి గాథ.. భగవంతుని లీల అంటున్న కాంట్రాక్టర్‌

బాలరాముడి విగ్రహ శిల వెనుక కన్నీటి గాథ.. భగవంతుని లీల అంటున్న కాంట్రాక్టర్‌

Phani CH

|

Updated on: Jan 31, 2024 | 8:05 PM

బాల రాముడి విగ్రహం కోసం ఉపయోగించిన కృష్ణ శిలను కర్ణాటకలోని ఓ రైతు పొలంలో నుంచి వెలికితీసారు. అయితే, ఈ శిలను వెలికితీయడం వల్ల తాను కష్టాలపాలయ్యానని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు తనకు భారీ మొత్తంలో ఫైన్ వేశారని తెలిపాడు. మైసూరు జిల్లా హెచ్ డీ కోట తాలూకా బుజ్జేగౌడనపురలోని పొలంలో ఈ శిలను గుర్తించారు. దీనిని వెలికి తీసేందుకు శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ ఆ పొలం యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

బాల రాముడి విగ్రహం కోసం ఉపయోగించిన కృష్ణ శిలను కర్ణాటకలోని ఓ రైతు పొలంలో నుంచి వెలికితీసారు. అయితే, ఈ శిలను వెలికితీయడం వల్ల తాను కష్టాలపాలయ్యానని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు తనకు భారీ మొత్తంలో ఫైన్ వేశారని తెలిపాడు. మైసూరు జిల్లా హెచ్ డీ కోట తాలూకా బుజ్జేగౌడనపురలోని పొలంలో ఈ శిలను గుర్తించారు. దీనిని వెలికి తీసేందుకు శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ ఆ పొలం యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కూలీలను పెట్టి శిలను బయటకు తీయించాడు. ఈ డీల్ లో ఖర్చులన్నీ పోనూ తనకు 25 వేల వరకు గిట్టుబాటు అయిందని శ్రీనివాస్ చెప్పాడు. అయితే, శిలను బయటకు తీసేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని, ఇందుకుగాను తనకు 80 వేలు జరిమానా కట్టాలని అధికారులు నోటీసులు జారీ చేశారని పేర్కొన్నాడు. రాష్ట్ర, గనులు భూగర్భ శాఖ అధికారులు జారీ చేసిన ఈ నోటీసులను చూసి ఆందోళనకు గురైనట్లు శ్రీనివాస్ చెప్పాడు. వెంటనే అధికారులను వెళ్లి కలవగా.. జరిమానా వెంటనే కట్టకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారని తెలిపాడు. దీంతో తన భార్య తాళిని తాకట్టు పెట్టి, సొమ్ము తీసుకెళ్లి జరిమానా చెల్లించినట్లు శ్రీనివాస్ వివరించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మద్దిచెట్టులో వినాయకుని రూపం..వింతను చూసేందుకు క్యూగట్టిన జనం

రామాలయంలో అద్భుతం.. శివలింగంపై నాగుపాము ప్రత్యేక్షం

మితిమీరిన ఉత్సాహం జైలుకు పంపింది.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

చేతి స్పర్శను కోల్పోయి ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. డాక్టర్లు స్కాన్ చేయగా మైండ్ బ్లాంక్