అతి పెద్ద క్రూజ్‌ నౌకకు పేరు పెట్టిన ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ

అతి పెద్ద క్రూజ్‌ నౌకకు పేరు పెట్టిన ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ

Phani CH

|

Updated on: Jan 31, 2024 | 8:35 PM

అమెరికాలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్‌ నౌక, రాయల్‌ కరీబియన్‌ సంస్థకు చెందిన ‘ఐకాన్‌ ఆఫ్‌ ది సీస్‌’ తన తొలి ప్రయాణానికి సిద్ధమైంది. ఫ్లోరిడా రాష్ట్రం మయామీ పోర్టు నుంచి స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం బయలుదేరి వారం రోజుల పాటు సముద్ర జలాలపై విహరిస్తూ వివిధ దీవులను చుట్టేయనుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం, ఆర్జెంటినా స్టార్ క్రీడాకారుడు లయోనెల్‌ మెస్సీ క్రూజ్‌ నౌకకు ఐకాన్ ఆఫ్‌ ద సీస్‌గా నామకరణం చేశారు.

అమెరికాలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్‌ నౌక, రాయల్‌ కరీబియన్‌ సంస్థకు చెందిన ‘ఐకాన్‌ ఆఫ్‌ ది సీస్‌’ తన తొలి ప్రయాణానికి సిద్ధమైంది. ఫ్లోరిడా రాష్ట్రం మయామీ పోర్టు నుంచి స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం బయలుదేరి వారం రోజుల పాటు సముద్ర జలాలపై విహరిస్తూ వివిధ దీవులను చుట్టేయనుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం, ఆర్జెంటినా స్టార్ క్రీడాకారుడు లయోనెల్‌ మెస్సీ క్రూజ్‌ నౌకకు ఐకాన్ ఆఫ్‌ ద సీస్‌గా నామకరణం చేశారు. నౌకలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా మెస్సీ నిలిచారు. మెస్సీతో పాటు స్థానిక మయామీ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లను రాయల్ కరీబియన్‌ సంస్థ తమ నౌకలోకి ఆహ్వానించింది. 365 మీటర్ల పొడవు, 20 డెక్కులున్న ఈ నౌకలో ఆరు వాటర్‌ స్లైడ్‌లు, ఏడు ఈత కొలనులు, ఐస్‌ స్కేటింగ్‌ రింక్‌, సినిమా థియేటర్‌, 40కి పైగా రెస్టారెంట్లు, బార్లు ఉన్నాయి. కుటుంబాలతో ప్రయాణించే వారికి అత్యుత్తమ అనుభూతిని అందించేలా ఈ నౌకలో సౌకర్యాలు ఉన్నట్లు రాయల్‌ కరీబియన్‌ సంస్థ సీఈవో జాసన్‌ లిబర్టీ అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్‌ సిలిండర్‌లో గ్యాస్‌కు బదులు నీళ్లు !! ఎక్కడంటే ??

కెమెరాకు చిక్కిన అరుదైన గోల్డెన్‌ టైగర్‌.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

పట్టపగలు చోరీ చేయడం ఇంత ఈజీనా !! నెట్టింట వీడియో వైరల్

బాలరాముడి విగ్రహ శిల వెనుక కన్నీటి గాథ.. భగవంతుని లీల అంటున్న కాంట్రాక్టర్‌

మద్దిచెట్టులో వినాయకుని రూపం..వింతను చూసేందుకు క్యూగట్టిన జనం