Pinky Sudeepa: తల్లైన ‘నువ్వు నాకు నచ్చావ్’ ఛైల్డ్ ఆర్టిస్ట్.. పింకీ కుమారుడిని చూశారా? వీడియో ఇదిగో

'నువ్వు నాకు నచ్చావ్' సినిమాతో విక్టరి వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కు ఎంత మంచి పేరొచ్చిందో పింకీ సుదీప కూడా అంతే ఫేమస్ అయ్యింది. దీంతో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె తాజాగా ఓ శుభవార్త చెప్పింది.

Pinky Sudeepa: తల్లైన నువ్వు నాకు నచ్చావ్ ఛైల్డ్ ఆర్టిస్ట్..  పింకీ కుమారుడిని చూశారా? వీడియో ఇదిగో
Pinky Sudeepa Family

Updated on: Nov 15, 2025 | 7:20 PM

టాలీవుడ్ ప్రముఖ నటి పింకీ సుదీప శుభవార్త చెప్పింది. తాను తల్లిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కొన్ని రోజుల క్రితమే ఆమె బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ ఈ శుభవార్తను ఆలస్యంగా పంచుకుంది. తాజాగా తన కుమారుడికి బారసాల ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు సుదీప దంపతులు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిందీ అందాల తార. ఇందులో సుదీప కుమారుడు చాలా క్యూట్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పింకీ సుదీప దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సినిమాల్లో బిజీగా ఉండగానే 2013లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకుంది పింకీ సుదీప. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా రెండేళ్లకు అంటే 2015లో ఆమె గర్భం దాల్చింది. కానీ థైరాయిడ్ సమస్య ఉండడంతో దురదృష్టవశాత్తూ అబార్షన్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో వెల్లడించింది. ఇది జరిగిన పదేళ్లకు మళ్లీ గర్భం దాల్చింది పింకీ సుదీప. దీంతో ఈ అమ్మడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

1994లో రవిరాజా పిన్నెశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ధర్మరాజు ఎం.ఏ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పింకీ. ఆ తర్వాత మా అన్నయ్య, నువ్వు నాకు నచ్చావ్ అల్లుడుగారు, బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే బిగ్‌బాస్ తెలుగు‌ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఆరోవారంలో హౌస్ నుంచి ఎలిమినేట్‌ అయిన సుదీప్ ఆ తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

పింకీ సుదీప కుమారుడి బారసాల వేడుక.. వీడియో..

నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ..

భర్తతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.