Bigg Boss 7 Telugu: శోభా కారణంగా హౌస్‌లో హౌస్ మేట్స్ అందరికి పనిష్మెంట్
ఫినాలే రేస్ నుంచి ఒకొక్కరు అవుట్ అవుతూ వస్తున్నారు. ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రమోను రిలీజ్ చేశారు. మొదటి ప్రమోలో టాస్క్ లో తక్కువ పాయింట్స్ వచ్చిన గౌతమ్ నుంచి పోటీ నుంచి తప్పించారు. గౌతమ్ నుంచి కొన్ని పాయింట్స్ ఎవరికీ ఇస్తావ్ అని అడగ్గా.. ప్రియాంక తన పాయింట్స్ నాకు ఇచ్చినప్పుడు .. నా పాయింట్స్ ఇవ్వాల్సి వస్తే అమర్ కు ఇవ్వాలని అడిగింది అని అర్జున్ దగ్గర చెప్పాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఫైనలిస్ట్ కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. తక్కువ పాయింట్స్ తెచుకున్నవారిని ఒకొక్కరిని పోటీలో నుంచి తప్పిస్తూ వస్తున్నాడు. వారి పాయింట్స్ పోటీలో ఉన్న మరొకరికి అంటే తమకు నచ్చిన వాళ్లకు ఇవ్వాలని చెప్పాడు బిగ్ బాస్. అలా ఫినాలే రేస్ నుంచి ఒకొక్కరు అవుట్ అవుతూ వస్తున్నారు. ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రమోను రిలీజ్ చేశారు. మొదటి ప్రమోలో టాస్క్ లో తక్కువ పాయింట్స్ వచ్చిన గౌతమ్ నుంచి పోటీ నుంచి తప్పించారు. గౌతమ్ నుంచి కొన్ని పాయింట్స్ ఎవరికీ ఇస్తావ్ అని అడగ్గా.. ప్రియాంక తన పాయింట్స్ నాకు ఇచ్చినప్పుడు .. నా పాయింట్స్ ఇవ్వాల్సి వస్తే అమర్ కు ఇవ్వాలని అడిగింది అని అర్జున్ దగ్గర చెప్పాడు. దాంతో గౌతమ్ తన పాయింట్స్ నుంచి అమర్ కు ఇచ్చాడు. దాంతో అమర్ అందరి కంటే టాప్ పొజిషన్ కు వెళ్ళిపోయాడు.
తాజాగా విడుదల చేసిన ప్రమోలో ముగ్గురు మాత్రమే మిగిలారు. ప్రశాంత్, అమర్, అర్జున్ మిగిలారు. ఈ ముగ్గురికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. సోర్ట్ మీ అవుట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఒక రంగులో ఉన్న రకరకాల కలర్స్ ఉన్న బాల్స్ నుంచి ఒకే రంగులో ఉన్న బాల్స్ ను ఒకే లైన్ లోకి తీసుకు రావాలని చెప్పాడు. ఈ గేమ్ లో ఎవరు ముందు బాల్స్ ను సేమ్ కలర్ లో ఉంచుతారో వారే విన్నర్ అని చెప్పాడు.
ఈ టాస్క్ లో అర్జున్ అందరికంటే ముందు బాల్స్ ను ఓకే కలర్ లోకి తీసుకువచ్చి బెల్ మోగించి విన్నర్ గా నిలిచాడు. ఆతర్వాత ప్రశాంత్ బెల్ కొట్టాడు కానీ కలర్ మిస్ చేశారని చూపించాడు. ఆ తర్వాత అదే గేమ్ ను శోభా ఆడటానికి ట్రై చేసింది . దాంతో బిగ్ బాస్ మీకు పనిష్మెంట్ ఇస్తున్న అని చెప్పాడు. దాంతో శోభా ఏడుపు మొహం పెట్టేసింది. శోబాతో పాటు అందరికి పనిష్మెంట్ అని చెప్పాడు బిగ్ బాస్. ఇందుకు గాను ఒక స్పెషల్ టికెట్ ను మీకోసం హౌస్ లోకి పంపిస్తున్నాం..ఇప్పటి నుంచి సుమారు గంట సేపు హాయిగా నిద్రపోవచ్చు అని చెప్పాడు.. దాంతో ఒక్కసారిగా అందరి మొఖాల్లో నవ్వులు వచ్చాయి. శోభా దెబ్బకు షాక్ అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.