Bigg Boss 7 Telugu: పావులు కదిపే చాణిక్యుడు.. శివాజీని పొగడ్తలతో ముంచేసిన బిగ్ బాస్
ఒక్కక్కరికి వారి వారి జర్నీని చూపించారు. బిగ్ బాస్ హౌస్ లోని వారి బెస్ట్ మూమెంట్స్ ను ఎమోషనల్ మూమెంట్స్ ను చూపించారు. ఆ ఫోటోలు చూస్తూ వారు ఆడిన గేమ్స్ ను చూస్తూ ఎమోషనల్ ఆయ్యారు హౌస్ మేట్స్. ఇందుకు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేశారు. అమర్, అర్జున్ కు సంబంధించిన ప్రోమోలను ఇప్పటికే రిలీజ్ చేశాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. టాప్ 6 గా నిలిచిన అమర్ దీప్, అర్జున్, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శివాజీ లను సర్‌ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. ఒకొక్కరినిలాన్‌లోకి రమ్మన్నారు బిగ్ బాస్. ఒక్కక్కరికి వారి వారి జర్నీని చూపించారు. బిగ్ బాస్ హౌస్ లోని వారి బెస్ట్ మూమెంట్స్ ను ఎమోషనల్ మూమెంట్స్ ను చూపించారు. ఆ ఫోటోలు చూస్తూ వారు ఆడిన గేమ్స్ ను చూస్తూ ఎమోషనల్ ఆయ్యారు హౌస్ మేట్స్. ఇందుకు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేశారు. అమర్, అర్జున్ కు సంబంధించిన ప్రోమోలను ఇప్పటికే రిలీజ్ చేశాడు బిగ్ బాస్. తాజాగా శివాజీ ప్రోమోను రిలీజ్ చేశారు. శివాజీ తన జర్నీని చూసుకొని ఎమోషనల్ అయ్యాడు.
శివాజీని లాన్ లోకిరమ్మని పిలిచిన బిగ్ బాస్.. శివాజీ జర్నీ కి సంబంధించిన ఫోటోలను చూపించాడు. ఆ ఫోటోలు చూసిన శివాజీ.. నా 25 ఏళ్ల ఇండస్ట్రీ అనుభవం ఒకెత్తూ .. ఈ బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ ఒకెత్తూ అని చెప్పాడు శివాజీ. ఆతర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ.. శివాజీకి అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు. మిమ్మల్ని ఒక వేలు ఎత్తి చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు వాళ్ల వైపే ఉండగలిగే మాటకారి మీరు అని అన్నాడు బిగ్ బాస్.
మీ గాయం మిమ్మల్ని ఎంత బాధించినా.. ఓటమి వైపు చూడలేదు.. మీ అబ్బాయే మీ డాక్టర్ గా వచ్చినప్పుడు మీ బాధనంతా మరిచిపోయారు అని చెప్పాడు బిగ్ బాస్. సరైన సమయంలో సరైన పావులు కదిపి చాణుక్యుడిగా నిలిచారు. ఈ పూర్తి సీజన్ లో మీ మీద పై చేయి సాధించిన విషయం ఎదో తెలుసా..? అది కాఫీ పై మీ ఇష్టం అని చెప్పాడు బిగ్ బాస్. కంటెస్టెంట్ గా మొదలై కన్ఫర్మ్ హౌస్ మేట్స్ గా నిలిచారు. మీ ఆట తీరే మిమ్మల్ని ఇప్పుడు ఈ స్థానంలో నిలిపింది అని చెప్పాడు బిగ్ బాస్. దాంతో శివాజీ మురిసిపోయారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.