Nandini Rai: ఆ కారణంతో టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో నందిని నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయట. దీంతో ఆమె మానసిక కుంగుబాటుకు గురైందట. నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానంటూ ఇటీవల తన చేదు అనుభవాలను పంచుకుందీ అందాల తార
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న హైదరాబాద్ అమ్మాయిల్లో నందినీ రాయ్ కూడా ఒకరు. చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు అతి తక్కువ టైమ్‌లోనే మంచి మోడల్‌గా పేరు సంపాదించుకుంది. 2009లో మిస్ హైదరాబాద్ కిరీటం, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిళ్లు గెల్చుకుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జీరో ఫోర్ జీరో అనే ఓ చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి ఖుషి ఖుషిగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని, కోతికొమ్మచ్చి, పంచతంత్ర కథలు తదితర సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సినిమాలతోనూ అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. గాలివాన, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ లాంటి వెబ్ సిరీస్‌ల తోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు బిగ్‌బాస్ రెండో సీజన్‌లో కూడా సందడి చేసింది. అయితే ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండలేకపోయింది. కాగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో నందిని నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయట. దీంతో ఆమె మానసిక కుంగుబాటుకు గురైందట. నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానంటూ ఇటీవల తన చేదు అనుభవాలను పంచుకుందీ అందాల తార
‘కెరీర్ ఆరంభంలో నేను నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో మానసికంగా చాలా కుంగిపోయా. ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయి. ఒక్కోసారి ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. అయితే నా ఆలోచనలు తప్పని త్వరగానే గ్రహించాను. గడ్డు పరిస్థితుల్లో నా స్నేహితులతో మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. ఆ తర్వాత సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నాను. దీంతో ఎట్టకేలకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను. జయాపజయాలకు పొంగిపోవడం కుంగిపోవడం వంటి విషయాలు సరైనది కాదని సైకాలజిస్ట్ దగ్గర నుంచి తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నాను. సినిమాల్లో హిట్ ఫ్లాప్ అనేది మనకి తెలియదని, అది మన కెరీర్‌ను డిసైడ్ చేయదని గ్రహించాను. అందుకే మళ్లీ నా ప్రయత్నాలు మొదలు పెట్టాను’ అని తన అనుభవాలను షేర్ చేసుకుంది నందిని.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..