Bigg Boss Maanas: అదిరిందయ్యా మానస్‌.. మొన్న పెళ్లి.. ఇప్పుడు బెంజ్‌ కారు.. ధర ఎంతంటే?

విజయవాడ వేదికగా నవంబర్‌ 22న మానస్‌, శ్రీజల వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో పాటు పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు మానస్ వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇప్పటికీ తమ పెళ్లి ఫొటోలను షేర్‌ చేస్తూ వార్తల్లో నిలస్తున్నారీ లవ్లీ కపుల్‌.

Bigg Boss Maanas: అదిరిందయ్యా మానస్‌.. మొన్న పెళ్లి.. ఇప్పుడు బెంజ్‌ కారు.. ధర ఎంతంటే?
Bigg Boss Maanas Family
Follow us
Basha Shek

|

Updated on: Dec 27, 2023 | 3:41 PM

ప్రముఖ నటుడు బిగ్‌ బాస్‌ ఫేమ్‌ మానస్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యన బ్రహ్మముడి సీరియల్‌తో బాగా ఫేమస్‌ అయ్యాడీ హ్యాండ్సమ్‌ యాక్టర్‌. ఇందులో మానస్‌ పోషించిన రాజ్‌ పాత్ర అలాగే దీపికా రంగరాజు (కావ్య)తో వచ్చే సీన్లు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మానస్‌ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. చెన్నైకు చెందిన శ్రీజతో కలిసి పెళ్లిపీటలెక్కాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. విజయవాడ వేదికగా నవంబర్‌ 22న మానస్‌, శ్రీజల వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో పాటు పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు మానస్ వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇప్పటికీ తమ పెళ్లి ఫొటోలను షేర్‌ చేస్తూ వార్తల్లో నిలస్తున్నారీ లవ్లీ కపుల్‌. ప్రస్తుతం సీరియల్స్‌, టీవీ షోలతో బిజీగా ఉంటోన్న మానస్‌ తన ఫ్యామిలీలోకి మరొకరిని ఆహ్వానించాడు. సుమారు నెలక్రితమే పెళ్లిపీటలెక్కిన ఈ నటుడు ఇప్పుడు కొత్త కారును కొన్నాడు. ఖరీదైన బెంజ్ ఎఫ్220డీ కారుని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కొత్త కారుతో తన ఫ్యామిలీ నంబర్స్‌తో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశాడు.

‘నా ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త మెంబర్‌ గురించి మీకు చెప్పడానికి చాలా సంతోషంగాఫీలవుతున్నాను’ అంటూ కారు కొన్న విషయాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేశాడు మానస్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు మానస్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నటుడు కొన్న కారు మోడల్‌ బెంజ్ ఎఫ్220డీ. దీని ధర సుమారు రూ.80-90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. కెరీర్‌ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించాడు మానస్‌. సోడా గోలీసోడా, గ్యాంగ్ ఆఫ్‌ గబ్బర్‌ సింగ్‌, ప్రేమికుడు, కాయ్‌ రాజా కాయ్‌ వంటి సినిమాల్లో హీరో, స్పెషల్‌ రోల్స్‌ పోషించాడు. అయితే బిగ్‌ బాస్‌ తెలుగు ఐదో సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యన మ్యాన్షన్‌ 24 అనే వెబ్ సిరీస్‌లోనూ ఓ ప్రధాన పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి

మానస్, శ్రీజల పెళ్లి వీడియో..

ఫొటో షూట్ లో మెరిసిన మానస్, శ్రీజ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా