Ashu Reddy: సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న అషు రెడ్డి.. అభిమానులకు షాక్
బిగ్ బాస్ రియాలిటీ షోతో బాగా ఫేమస్ అయిన అషురెడ్డి పై ఈ మధ్యన సంచలన ఆరోపణలు వచ్చాయి. లండన్‌కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర తండ్రి.. హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు

అషు రెడ్డి.. ఇటీవల కాస్త గట్టిగానే వినిపించిన పేరు ఇది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆర్థిక వ్యవహారాలు, వివాహానికి సంబంధించి వార్తల్లో నిలిచింది అషు రెడ్డి. ముఖ్యంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేసి మరింత పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫొటోలతో, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. కాగా అషురెడ్డిపై ఇటీవలే కేసు ఫైల్ అయ్యింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తన దగ్గర 9 కోట్ల 35 లక్షల రూపాయిలు కాజేసిందంటూ లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ధర్మేంద్ర హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి : బీటెక్ మధ్యలో వదిలేసింది.. రూ. 500తో వచ్చి రూ.100కోట్ల ఆస్తుపాస్తులు సంపాదించింది
తాజాగా సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసింది అషు రెడ్డి. దాంతో మళ్లీ చర్చకు దారి తీసింది. ఫొటోలు షేర్ చేస్తూ కెమెరా ఎమోజీ తప్ప మరే క్యాప్షన్ పెట్టకపోవడం గమనార్హం.. అయితే అషు రెడ్డికి నిజంగానే నిశ్చితార్థం జరిగిందా.? లేక ఏదైనా మూవీ షూటింగ్ లో స్టిల్స్ షేర్ చేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి :OTT Movie : హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే ట్విస్ట్.. ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్..
అయితే కొందరు అషు రెడ్డికి విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేవలం తన ఫోటోలు మాత్రమే పంచుకుంది. వరుడి వివరాలను అషు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కేవలం ఫొటోలు మాత్రమే షేర్ చేసింది అషు రెడ్డి. అయితే సైలెంట్ గా అషురెడ్డి నిశ్చితార్థం చేసుకోవడంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి : బికినీ వేసుకోమని ఫోర్స్ చేశాడు.. 19ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను
View this post on Instagram




