ఒకే జిమ్‌లో వర్కౌట్స్ చేసేవాళ్ళం.. ఆ స్టార్ హీరో నన్ను గుర్తుపట్టలేదు..
బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు భరణి. పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటించి మెప్పించారు. విలన్ గా తన ప్రతిభను చాటుకున్నాడు భరణి. ఇప్పటికీ పలు సినిమాల్లో విలన్ గా నటిస్తున్నాడు భరణి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భరణి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

భరణి.. బిగ్ బాస్ తర్వాత మరోసారి పాపులర్ అయ్యాడు.. విలన్ గా సినిమాల్లో నటించి మెప్పించిన భరణి.. బిగ్ బాస్ లో మెప్పించాడు.సీజన్ 9 మధ్యలో ఎలిమినేట్ అయ్యి ఆతర్వాత మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. చాలా వారాలు కొనసాగిన భరణి చివరో ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లో పెద్ద దిక్కుగా ఉండి తన ఆటతో మెప్పించాడు. బిగ్ బాస్ తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయ్యాడు భరణి. అలాగే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు భరణి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భరణి మాట్లాడుతూ.. ఓ హీరో గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆ స్టార్ హీరో అందరితో కలిసి భోజనం చేస్తాడని, ఎంతో ఒదిగి ఉంటాడని అన్నారు. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకూ ఆ హీరో ఎవరంటే..
ఓ ఇంటర్వ్యూలో భరణి మాట్లాడుతూ.. బాహుబలి చిత్ర నిర్మాణ సమయంలో ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాహుబలి సినిమాకు ముందు, భరణి, ప్రభాస్ ఒకే స్లిమ్ జిమ్లో కలిసి వ్యాయామం చేసేవారట. అయితే, బాహుబలి సెట్‌లో మార్తాండ వర్మ అనే పాత్రలో ఉన్న భరణిని ప్రభాస్ గుర్తుపట్టలేదని భరణి తెలిపారు. ఈ విషయాన్ని తాను ప్రభాస్‌కి చెప్పే అవకాశం ఉన్నా.., అక్కడ షూటింగ్ హడావిడి, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ లాంటి పెద్ద నటులు అలాగే వందల మంది జూనియర్ ఆర్టిస్టుల షూటింగ్ హడావిడిలో చెప్పలేకపోయానని పేర్కొన్నారు భరణి. బాహుబలి షూటింగ్ లో ప్రభాస్ టేబుల్ వద్ద భరణికి ప్రత్యేకంగా ప్లేట్ పెట్టడం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని భరణి గుర్తు చేసుకున్నారు. అప్పటికే ప్రభాస్ ఒక పెద్ద స్టార్‌గా ఎదిగి ఉన్నప్పటికీ, అందరితో సమానంగా కూర్చుని భోజనం చేయాలనే ఆయన మంచితనం తనను ఆకట్టుకుందని అన్నాడు భరణి.
రాజమౌళి గారి సెట్‌లో ఆర్టిస్ట్ లను ఎంతో బాగా చూసుకుంటారని భరణి తెలిపాడు. చిన్న నటులు, పెద్ద నటులు అనే భేదం లేకుండా దర్శకుడు రాజమౌళి, రమా రాజమౌళి, వల్లీ వంటి వారితో పాటు చిత్ర బృందమంతా ఒకేచోట కూర్చుని భోజనం చేస్తారని తెలిపారు. రమా రాజమౌళి స్వయంగా యాక్టర్స్ అవసరాలను చూసుకుంటారని, టచ్-అప్‌లు, ఆభరణాల వంటివి కూడా ఆమె స్వయంగా సెట్ చేస్తారని, షాట్‌లోకి వెళ్లే ముందు ఎటువంటి ఆందోళన లేకుండా చూసుకుంటారని భరణి చెప్పుకొచ్చాడు. రాజమౌళి గారి సినిమాలలో ఒకసారి నటించినంత మాత్రాన మళ్ళీ అవకాశం వస్తుందని అనుకోవడం పొరపాటు అని భరణి అన్నారు. రాజమౌళి తన పాత్రకు ఎవరైతే సరిపోతారో వారిని మాత్రమే ఎంచుకుంటారని, అది ఒక చిన్న పాత్ర అయినా, ఒక షాట్ క్యారెక్టర్ అయినా సరే, సరైన నటుడిని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటారని భరణి చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




