Bigg Boss 8 Telugu : ఇదెక్కడి రచ్చ రా సామి.! యష్మీ బాగోతాలు బయట పెట్టిన పృథ్వీ..

సూపర్ మచ్చి సాంగ్‌కు మణికంఠతో పాటు నైనిక కూడా స్టెప్పులేసింది. ఆతర్వాత నబీల్ కు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు..  స్పూన్‌తో బకెట్ నీళ్లు నింపాలని టాస్క్ ఇచ్చారు. ఆ తర్వాత మణికంఠ యష్మి కలిసి డాన్స్ చేస్తే చూడాలని ఉందని అన్నారు బిగ్ బాస్. దాంతో ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. పృథ్వీకి లేడీ గెటప్ వేశారు. పృథ్వీ గెటప్ చూసి విష్ణు ప్రియా అయితే తెగ సిగ్గుపడింది.

Bigg Boss 8 Telugu : ఇదెక్కడి రచ్చ రా సామి.! యష్మీ బాగోతాలు బయట పెట్టిన పృథ్వీ..
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 03, 2024 | 8:54 AM

బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ జరుగుతోంది. సోనియా ఎలిమినేట్ అవ్వడంతో ఇప్పుడు హౌస్ లో అసలైన ఆట మొదలైంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్‌కు మార్నింగ్ మార్నింగే  టాస్క్ ఇచ్చాడు. నాగ మణికంఠ  తన డాన్స్ తో అదరగొట్టాడు. సూపర్ మచ్చి సాంగ్‌కు మణికంఠతో పాటు నైనిక కూడా స్టెప్పులేసింది. ఆతర్వాత నబీల్ కు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు..  స్పూన్‌తో బకెట్ నీళ్లు నింపాలని టాస్క్ ఇచ్చారు. ఆ తర్వాత మణికంఠ యష్మీ కలిసి డాన్స్ చేస్తే చూడాలని ఉందని అన్నారు బిగ్ బాస్. దాంతో ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. పృథ్వీకి లేడీ గెటప్ వేశారు. పృథ్వీ గెటప్ చూసి విష్ణు ప్రియా అయితే తెగ సిగ్గుపడింది. ఇక ఈ గేమ్‌లో కాంతార టీం గెలవడంతో.. వాళ్లకి చాక్లెట్స్ పంపించాడు బిగ్ బాస్. దాంతో సర్వైవల్ టాస్క్ పూర్తి అవ్వడంతో అన్ని గేమ్స్ లో ఎక్కువ ఎవరు గెలిచారో వాళ్లకు స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్. కాంతార టీమ్ కు పవర్ లభించింది.

ఆ తర్వాత క్లాన్ నుంచి నేరుగా చీఫ్ అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. దాంతో ఎవరు ఛీప్ గా ఉండాలని డిస్కషన్ పెట్టారు. యష్మీ నేనే చీఫ్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది. కానీ పృథ్వీకి అంత నాలెడ్జ్ లేదు అని మాట్లాడింది. దానికి పృథ్వీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. నువ్వు చీఫ్ అయితే హౌస్ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదు అని అనేశాడు. దాంతో యష్మీ అరవడం మొదలు పెట్టింది. దాంతో నువ్వు వాయస్ పెంచకు.. ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావ్.. పైగా నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావని నీకు నువ్వే ఒప్పుకున్నావ్.. మళ్లీ చీఫ్ అవుతానని ఎలా అంటున్నావ్..అంటూ పృథ్వీ కూడా గట్టిగానే ఇచ్చిపడేశాడు.

దాంతో పృథ్వీ యష్మీ బాగోతాలను బయట పెట్టడం మొదలు పెట్టాడు. నువ్వు మణికంఠని మగాడు కాదని అన్నావ్ కదా.. అనలేదని అబద్దం చెప్పావ్ అని పృథ్వీ అడిగితే నేను అలా అనలేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అవునా.. నువ్వు అననప్పుడు ఎందుకు సారీ చెప్పావ్ అని అన్నాడు పృథ్వీ. దాంతో ఆ పాయింట్ తీయకు అంటూ చెప్పుకొచ్చింది యష్మీ . ఆ టాపిక్ ఎత్తకు.. మమ్మీపై ఒట్టేశాను కదా’ అని చెప్పుకొచ్చింది యష్మీ. మణికంఠని బాయ్ కాదని అనడం నువ్వు చేసిన తప్పు. దాన్ని మళ్లీ ఒప్పుకోకపోవడం ఇంకో తప్పు. నీకు నువ్వే చీఫ్‌గా ఫెయిల్ అయ్యానని రెడ్ ఇచ్చుకున్నావ్.. నీకు నువ్వే తెలుసు.. బ్యాడ్ ప్లేయర్ అని.. స్పెల్లింగ్ గేమ్‌లో ఓడిపోయావ్.. ఇవన్నీ నీ మిస్టేక్సే అని యష్మీ బాగోతాలు బయట పెట్టాడు పృథ్వీ .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌