AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konda Surekha: కొండా సురేఖ పై మండిపడ్డ టాలీవుడ్.. చూస్తూ కూర్చోమంటూ..

కేటీఆర్ తీరుతో సినీరంగంలోని పలువురు ఇబ్బంది పడ్డారని తెలంగాణ మంత్రి కొండ సురేఖ అన్నారు. కొందరు హీరోయిన్స్ త్వరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మత్తు పదార్థాలకు అలవాటు పడి.. సినీ పరిశ్రమకు చెందిన కొందరిని వాటికి అలవాటు చేశారని..

Konda Surekha: కొండా సురేఖ పై మండిపడ్డ టాలీవుడ్.. చూస్తూ కూర్చోమంటూ..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Oct 03, 2024 | 7:53 AM

Share

కొండా సురేఖ కామెంట్ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసింది.. తెలంగాణ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. కేటీఆర్ తీరుతో సినీరంగంలోని పలువురు ఇబ్బంది పడ్డారని తెలంగాణ మంత్రి కొండ సురేఖ అన్నారు. కొందరు హీరోయిన్స్ త్వరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మత్తు పదార్థాలకు అలవాటు పడి.. సినీ పరిశ్రమకు చెందిన కొందరిని వాటికి అలవాటు చేశారని.. రేవ్ పార్టీలో చేయడంతోపాటు.. సినీతారలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. అలాగే అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆర్ కారణమని అన్నారు. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కి పడింది.

సినిమా వాళ్ళ పై కొండా సురేఖ ఇలాంటి కామెంట్స్ చేయడం క్యారెట్ కాదు అంటూ పలువురు సినీ ప్రముఖులు అన్నారు. సినిమా వాళ్ళను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ చాలా మంది స్పందించారు. సమంత విడాకుల పై కొండా సురేఖ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో సమంత స్పందించింది. నా వ్యక్తిగత జీవితం అంటే అంత చిన్న చూపా.? నా విడాకులు సామరస్యంగా జరిగాయి. నేను రాజకీయాలకు అతీతంగా ఉంటాను అంటూ సమంత కౌంటర్ ఇచ్చారు.

ఆ తర్వాత కొండా సురేఖ కామెంట్స్ పై.. నాగార్జున స్పందిస్తూ..” మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అలాగే ప్రకాష్ రాజ్ స్పందిస్తూ..ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. అంటూ ఫైర్ అయ్యారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. అలాగే నాని కూడా రియాక్ట్ అయ్యారు..”మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? అనిపిస్తోంది” అని నాని అన్నారు. “మేం మీ స్థాయిలో దిగజారి మాట్లాడలేము” అని సీనియర్ నటి ఖుష్బూ అన్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ మాట్లాడుతూ..ఇండస్ట్రీలో పని చేసే అడవాళ్లకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని హేమ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.