AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: మీ వల్లే నేను ఇక్కడ ఉన్నాను.. మీరే నా అమ్మ .. ఏడిపించేసిన యావర్

శివాజీ, అర్జున్, అమర్ దీప్, ప్రియంకాల జర్నీ చూపించి ఎమోషనల్ అయ్యేలా చేసిన బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో యావర్ జర్నీని చూపించాడు. దెబ్బకు యావర్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీరే నా అమ్మ అంటూ ఏడ్చేశాడు యావర్. నిజానికి యావర్ ఈ స్థానానికి వస్తాడని ఎవరు అనుకోలేదు. మహా అయితే మూడు వారాలు ఉంటాడు ఆ తర్వాత బ్యాగ్ సర్దేసుకుంటారు అనుకున్నారు అందరు.

Bigg Boss 7 Telugu: మీ వల్లే నేను ఇక్కడ ఉన్నాను.. మీరే నా అమ్మ .. ఏడిపించేసిన యావర్
Bigg Boss7
Rajeev Rayala
|

Updated on: Dec 14, 2023 | 7:35 AM

Share

బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు వచ్చేసింది. చివరి వీక్ మొత్తం ఎమోషనల్ గా సాగేలా ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఒకొక్కరిని పిలిచి వారి జర్నీని చూపించారు. శివాజీ, అర్జున్, అమర్ దీప్, ప్రియంకాల జర్నీ చూపించి ఎమోషనల్ అయ్యేలా చేసిన బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో యావర్ జర్నీని చూపించాడు. దెబ్బకు యావర్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీరే నా అమ్మ అంటూ ఏడ్చేశాడు యావర్. నిజానికి యావర్ ఈ స్థానానికి వస్తాడని ఎవరు అనుకోలేదు. మహా అయితే మూడు వారాలు ఉంటాడు ఆ తర్వాత బ్యాగ్ సర్దేసుకుంటారు అనుకున్నారు అందరు. కానీ తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీ చూసుకొని ఎమోషనల్ అయ్యాడు.

లాన్ లోకి యావర్ ను రమ్మని పిలిచాడు బిగ్ బాస్. అక్కడ ఉన్న తన మెమొరీస్, స్వీట్ మూమెంట్స్ చూసి ఆనందపడ్డారు యావర్. ఆతర్వాత తన సోదరుడి ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆతర్వాత యాక్టివిటీ రూమ్ కు రమ్మన్నాడు బిగ్ బాస్. యాక్టివిటీ రూమ్ లో బిగ్ బాస్ యావర్ ను తెగ పొగిడేశాడు. బిగ్ బాస్ మాటలకూ యావర్ తెగ సంబరపడ్డాడు.

బిగ్ బాస్ యావర్ గురించి మాట్లాడుతూ.. ” ప్రజల ప్రేమను పొందాలనే కోరికతో పరిచయం లేని మనుషుల మధ్య.. భాష రాకపోయినా మీలోని భావాలను అందరితో పంచుకొని యావర్ ఎవరో ఈ ప్రపంచానికి చూపించాలనే లక్ష్యంతో ఈ ఇంట్లోకి అడుగుపెట్టారు. మీరు ఒక విషయాన్ని ఇష్టపడితే దాని కోసం ఎంత కష్టమైనా పడతారని అందరికీ తెలిసింది. యావర్‌తో పోటీ అంటే అందరూ ఆలోచించేలా చేశారు అని అన్నాడు బిగ్ బాస్ అలాగే హౌస్ లోకి వచ్చిన ఆరో వారంలోనే బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్‌గా నిలాచారు అని అన్నాడు. అమూల్యమైన స్నేహం కూడా దొరికింది అన్నాడు. ఎవరైనా సరే నిలదీసే ధైర్యాన్ని చూపించారు. అదే ధైర్యం మీరు ఎవిక్ష్ పాస్‌ని సాధించేలా చేసింది. మీకు తెలుగు నేర్పుతూ మిగతావారు మర్చిపోయే పరిస్థితి వచ్చినా ఇప్పటికైనా మీ తెలుగు బాగుపడిందని మీ రోటీల సాక్షిగా బిగ్‌బాస్ నమ్ముతున్నారు అంటూ బిగ్ బాస్ చెప్తుంటే యావర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆతర్వాత యావర్ మాట్లాడుతూ.. అందరునాకు కోపం ఎక్కువ అంటుంటారు. నాలో చాలా కోపం ఉందని అంటుంటారు.. కానీ నాలో చరిత్ర సృష్టించే దమ్ము ఉంది.. థాంక్యూ బిగ్‌బాస్. నేను ఎవరు బిగ్ బాస్.. నేను ఒక నథింగ్ నన్ను సంథింగ్ చేసింది బిగ్ బాస్. నేను హైదరాబాద్ బిడ్డ కాదు, కోల్‌కత్తా బిడ్డ కాదు.. నేను మీ బిడ్డను.. నా అమ్మ మీరే.. నా రెండో అమ్మ .. అంటూ అందరిని ఎమోషనల్ అయ్యేలా చేశాడు యావర్.

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!