Central Government: దేశంలోని రైతులందరికీ గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోమవారం భారత పర్యటనకు వచ్చారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు మోదీ స్వాగతం పలికారు. కేవలం కొన్ని గంటల పాటే ఆయన ఢిల్లీలో గడిపారు. అయితే పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. రైతులకు ఉపయోపడేలా కీలక ఒప్పంద జరిగింది.

సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు UAE ప్రెసిడెంట్ ఢిల్లీలో దిగారు. ప్రధాని మోదీతో కేవలం 3 గంటలు భేటీ అయ్యారు. ఎలాంటి హడావిడి లేదు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు లేవు.. వచ్చిన పని ముగించుకుని వెళ్లిపోయారు. కానీ ఆ 180 నిమిషాల్లో జరిగిన ఒప్పందాలు రాబోయే పదేళ్లలో మన దేశ రూపురేఖలను మార్చబోతున్నాయి.
ముఖ్యమైన ఒప్పందాలు
-పెద్ద కంపెనీల సంగతి పక్కన పెడితే, మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగ. ‘భారత్ మార్ట్’, ‘వర్చువల్ ట్రేడ్ కారిడార్’ పేర్లతో కొత్త ప్లాట్‌ఫామ్స్ వస్తున్నాయి. దీనివల్ల మన ఊరి బియ్యం మిల్లు ఓనర్ అయినా, మసాలాలు అమ్మే వ్యాపారి అయినా.. తమ సరుకులను నేరుగా దుబాయ్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు.
-2032 నాటికి ఇండియా-UAE మధ్య వ్యాపారాన్ని డబుల్ చేయడమే లక్ష్యం. మన సరుకులకు గల్ఫ్ దేశాల్లో గిరాకీ పెరుగుతుంది. లాజిస్టిక్స్ (రవాణా) చూసుకోవడానికి అదానీ, టాటా లాంటి కంపెనీలు రెడీగా ఉన్నాయి.
-గుజరాత్‌లోని ‘ధోలేరా’ సిటీలో ఎయిర్‌పోర్ట్, పోర్ట్, కరెంట్ ప్రాజెక్టుల కోసం UAE భారీగా డబ్బులు పెడుతోంది. దీనివల్ల మనం వస్తువులు తయారు చేయడమే కాదు, వాటిని రవాణా చేయడంలోనూ కింగ్ అవుతాం. అదానీ గ్రూప్, టాటా ఎలక్ట్రానిక్స్, టోరెంట్ పవర్ లాంటి కంపెనీలకు ఇది జాక్‌పాట్.
-మన HPCL కంపెనీ, UAEకి చెందిన గ్యాస్ కంపెనీతో 10 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. దీనివల్ల లాభం ఏంటంటే.. వచ్చే పదేళ్ల పాటు గ్యాస్ ధరలు, కరెంట్ ఖర్చులు ఒక అంచనాలో ఉంటాయి. ఫ్యాక్టరీలకు, సామాన్యులకు ఇది పెద్ద ఊరట.
-చిన్న సైజు అణు రియాక్టర్ల టెక్నాలజీలో ఇద్దరూ కలిసి పని చేస్తారు. మన ఇస్రో (IN-SPACe)తో కలిసి రాకెట్ లాంచింగ్, స్పేస్ సామాగ్రి తయారీలో UAE భాగస్వామి అవుతుంది.
-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక సూపర్ కంప్యూటర్‌ను ఇండియాలో ఏర్పాటు చేస్తారు. మన టెక్ స్టార్టప్‌లకు ఇది రాకెట్ ఇంధనం లాంటిది
-ఇన్నాళ్లూ మనం ఆయుధాలు కొనేవాళ్ళం. కానీ ఇకపై ఇద్దరం కలిసి ఆయుధాలు, డిఫెన్స్ టెక్నాలజీని తయారు చేస్తాం. L&T, BEL లాంటి మన కంపెనీలకు మిడిల్ ఈస్ట్‌లో మార్కెట్ ఓపెన్ అయినట్టే.
-ఫుడ్ సేఫ్టీ నిబంధనలను సులభతరం చేశారు. అంటే.. మన రైతులు పండించే బియ్యం, పండ్లు, ఇతర ఆహార ఉత్పత్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా UAEకి ఎగుమతి అవుతాయి.
