AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy lifestyle: హాయిగా, ఆనందంగా లైఫ్‌ లీడ్‌ చేయాలా?.. అయితే మీలో ఈ అలవాట్లు ఉండాల్సిందే

జీవితంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ జాబ్ టెన్షన్స్, ఆర్థిక ఇబ్బందులు, ఫ్యామిలీ టెన్షన్స్ కారణంగా చాలా మంది మానసింకంగా తీవ్రంగా కృంగిపోతూ ఉంటారు. వీటిని ఎదుర్కొని జీవింతాన్ని సంతోశంగా లీడ్ చేయాలంటే మనం రోజువారి జీవనశైలిలో కొన్ని సాధారణ అలవాట్లను అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ అలవాట్లు మీ మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యం, సంబంధాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఆ అలవాట్లేమితో తెలుసుకుందాం పదండి.

Happy lifestyle: హాయిగా, ఆనందంగా లైఫ్‌ లీడ్‌ చేయాలా?.. అయితే మీలో ఈ అలవాట్లు ఉండాల్సిందే
Happy Lifestyle Habits
Anand T
|

Updated on: Jan 20, 2026 | 7:30 AM

Share

సంతోషకరమైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ నేటి పోటీ ప్రపంచంలో.. వర్క్‌ ప్రెజర్, ఫ్యామిలీ టెన్షన్స్, ఆర్థిక ఇబ్బందు ఇలా ఎన్నో టెన్షన్స్ కారణంగా ఎవరూ సంతోషంగా ఉండలేకపోతున్నారు. దీని వల్ల చాలా మంది నిరాశ, ఆందోళనకు గురవుతున్నారు. వీటిని అధిగమించేందుకు చాలా మంది అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ వారికి సరైన మార్గం దొరక్కా మళ్లీ అదే రోటీన్ లైప్‌లో బుతకుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ వ్యాసం. మీరు మీ జీవైన శైలిలో కొన్ని అలవాట్లను అవర్చుకోవడం ద్వారా మీ లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేయవచ్చు. కాబట్టి సంతోషంగా ఉండటానికి మీకు సహాయపడే ఆ అలవాట్లు ఏవే తెలుసుకోండి.

జీవితంలో సంతోషంగా ఉండటానికి అలవర్చుకోవలసిన అలవాట్లు ఇవే

మంచి ఆలోచనలతో డే ప్రారంభించండి: మనం మార్నింగ్ అనుభూతులు అనేవి మన రోజుమొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మీరు మార్నింగ్ లేచిన వెంటనే మీ మనస్సును పాజిటీవ్ ఆలోచనలతో నింపుకోండి. అలాగే పాటిజీవ్‌గా ఉండే వస్తువులను చూడండి. ఇది మీ మనస్సును ఆహాయిగా ఉంచుకతుంది. తద్వారా మీరు రోజంతా యాక్టీవ్‌గా, పాజిటీవ్‌గా ఉండేందుకు సహాయపడుతుంది.

నవ్వుతూ ఉండండి: నవ్వు ఆరోగ్యానికి వంరం అని చాలా మంది చెబుతుంటారు. నవ్వు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందంటారు. ఒక సాధారణ చిరునవ్వు అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. మీరు నవ్వినప్పుడు, సానుకూల ఆలోచనలు స్వయంచాలకంగా మనస్సులోకి వస్తాయి. ఇది మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల మీరు రోజంతా పాజిటీవ్‌ తాట్స్‌తో ఉంటారు. పక్కవారితో కూడా సంతోషంగా గడుపుతారు.

కొత్త విషయాలను నేర్చుకోండి : మనం ప్రతిరోజూ ఒకేలా లీడ్ చేస్తుంటే మన బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. కాబట్టి, మీ దినచర్యకు తాజాదనాన్ని జోడించడానికి కొత్త అలవాట్లను అలవర్చుకోండి. ప్రతి నిమిషం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నించండి.. సమయాన్ని వృదా చేయకండి. ఉదాహరణకు, కొత్త వంటకం చేయడం. బుక్స్ చదవడం, కొత్త గేమ్స్ ఆడడం చేయండి.

ఆరోగ్యకరమైన జీవనశైలి: సంతోషంగా ఉండటానికి ఆరోగ్యకరమైన శరీరం, మనస్సు చాలా అవసరం. దీన్ని సాధించడానికి, ప్రతిరోజూ వ్యాయామం చేయండి, సమతుల్య ఆహారం తీసుకోండి, తగినంత నిద్ర పొందండి. మానసిక ప్రశాంతత, శక్తిని కాపాడుకోవడానికి మీ దినచర్యలో యోగా, ధ్యానాన్ని చేర్చుకోండి. ఈ పద్ధతులు మీరు సంతోషంగా ఉండటానికి సహాయపడతాయి.

సానుకూలంగా ఆలోచించండి : మీరు ఎప్పుడూ నెగిటీవ్‌గా ఆలోచించకుండా సానుకూలంగా ఆలోచించడం అలవాటు చేసుకోండి. దీని వల్ల ప్రతి సవాలును సులభంగా చూడవచ్చు. అందువల్ల, ప్రతి పరిస్థితిలోనూ సానుకూలతను చూసే అలవాటును పెంపొందించుకోండి. ఇది మనశ్శాంతిని తీసుకురావడమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.

మ్యూజిక్ వినడం: మీ మనస్సు తేలికగా, హ్యాపీగా ఉండేందుకు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. ఏదైనా పనితో మీరు విసుగు చెందినప్పుడు, మీకు ఇష్టమైన పాట వినవచ్చు. సంగీతం వినడం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఇది మీ మనస్సుకు హాయిగా ఉంటుంది. మీ మైండ్‌లో పాజిటీవ్‌ వైబ్స్ వస్తాయి. మీ మైండ్ రీఫ్రెష్‌ అవుతుంది. ఒత్తిడిని తగ్గించుకుని సంతోషంగా ఉండటానికి, పని నుండి విరామం తీసుకుని ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లండి. ఇది ఖచ్చితంగా మీ మనసును సంతోషపరుస్తుంది.

మీకోసం టైం కేటాయించండి: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో జనాలు వారికోసం వారు టైం కేటాయించుకోవడం మానేశారు. మనం జీవితంలో సంతోషంగా ఉండాలంటే, మనకోసం మనం సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం. మన గురించి మనం ఆలోచించి, మనం చేసే పనులపై శ్రద్ధ పెడితే మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అలాగే, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. ఇది మనసును సంతోషపరుస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.