Bigg Boss 7 Telugu: ప్రశాంత్ పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన అర్జున్.. దెబ్బకు బిత్తరపోయిన రైతు బిడ్డ
ఓట్ అప్పీల్‌కి ఛాన్స్ గెలుచుకునేందుకు ఒక గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఇసుక కేక్ ను తెప్పించి ఎవరైతే ఆ కేక్ పై ఉన్న చెర్రీ కింద పడకుండా కట్ చేస్తారో వారు విన్ అయినట్టు అని తెలిపాడు. గెలిచిన వారు ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ దక్కించుకుంటారని చెప్పాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో అమర్ దీప్ విజయం సాధించారు. ఆతర్వాత రెండో గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ మరింత గరంగరంగా జరిగింది. ముందుగా ఇద్దరు పిల్లల బొమ్మలను హౌస్ లోకి పంపించి అవి బిగ్ బాస్ పిల్లలని చెప్పి నేను షాపింగ్ కు వెళ్తున్నా.. నేను వచ్చే వరకు పిల్లలను ఆడించండి అని చెప్పాడు. దాంతో హౌస్ లో ఉన్నవారంతా ఓ రేంజ్ లో యాక్టింగ్ చేశారు. ఆ తర్వాత ఓట్ అప్పీల్‌కి ఛాన్స్ గెలుచుకునేందుకు ఒక గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఇసుక కేక్ ను తెప్పించి ఎవరైతే ఆ కేక్ పై ఉన్న చెర్రీ కింద పడకుండా కట్ చేస్తారో వారు విన్ అయినట్టు అని తెలిపాడు. గెలిచిన వారు ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ దక్కించుకుంటారని చెప్పాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో అమర్ దీప్ విజయం సాధించారు. ఆతర్వాత రెండో గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్.
గార్డెన్ ఏరియాలో ఉన్న గంటని బజర్ మోగగానే ముందుగా ఎవరు మ్రోగిస్తారో వారు విన్నర్ అని చెప్పాడు. బజర్ మోగిన వెంటనే అందరు పరుగు పెట్టారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ప్రశాంత్ ను ఆపే ప్రయత్నం చేశాడు.. అంతలో అర్జున్ చేయి ప్రశాంత్ దవడకు తగిలింది. దాంతో ప్రశాంత్ అర్జున్ ను ఆపే ప్రయత్నం చేస్తున్నచేశాడు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.
మొత్తానికి అర్జున్ గంటను మోగించాడు. అయితే తనకు అర్జున్ చేయి తగిలింది అని ప్రశాంత్ వాదన చేశాడు. అది నాకు అలవాటు రా.. పరిగెత్తే తప్పుడు నా చెయ్యి వెనక్కి వెళ్తుంది అని అన్నాడు. సంచలక్ గా ఉన్న అమర్ కూడా ప్రశాంత్ దే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు. మరో వైపు ప్రియాంకా కూడా ప్రశాంత్ ను తప్పుబట్టింది. అందరూ నెట్టుకుంటున్నారు. లీజ్ ఫెలోస్ లాగ అంటూ ప్రియాంక తిట్టింది. బిగ్‌బాస్ నాకు ఈ వీడియో మీరు ప్లే చేసి చూపించాలి.. అర్జున్ కావాలనే నన్ను ఆపేశాడు అని వాదించాడు. నిన్న నువ్వు కూడా స్విమ్మింగ్ పూల్ టాస్కులో నాకు ఇలానే తాకించావ్.. కానీ నేను ఏమైనా అన్నానా.. సోది చెప్పకు.. వెధవ రీజన్లు ఆపు.. ఏమనట్లేదు కదా అని ఫస్ట్ నుంచి.. నోరు ముయ్.. ఎక్కువ మాట్లాడకు.. అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు అర్జున్. న్ను ఇట్ల కొట్టిండు.. దవడ మొత్తం పగిలిపోయింది.. అంటూ ప్రశాంత్ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అర్జున్ నేను పరిగెత్తేటప్పుడు నా చేతులు వెనక్కి వెళ్తాయి అని చెప్పాడు అర్జున్. ఈ ఇద్దరి మధ్యలో దూరింది ప్రియాంక. ఎలా ఆపుతారురా.. కావాలని ఎవరు ఆపుతారు అంటూ అర్జున్ వైపు మాట్లాడింది. ఇంతలో శివాజీ వచ్చి ప్రశాంత్ ను పక్కకు తీసుకువెళ్లాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
