AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఓరినీ యేషాలో.. అమర్ దీప్‌కు కాలేదాకా చేసిన ప్రశాంత్..

హౌస్ లో పవర్ అస్త్ర సాధించిన ముగ్గురు మెంబర్స్ నుం జ్యురీ గా ఉంచి ఒకొక్కరు ఇద్దరినీ నామినేషన్స్ లో ఉంచి సరైన రీజన్ చెప్పాలని వారు చెప్పిన రీజన్స్ కు జ్యురీ కన్విన్స్ అయితే వారిని నామినేట్ అయినట్టు అనౌన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ ప్రక్రియలో వాదనలు గట్టిగానే జరిగాయి. ముందుగా ప్రిన్స్ ప్రియాంకా. తేజను నామినేషన్స్ లో ఉంచాడు. యావర్ చెప్పిన రీజన్స్ కు ప్రియాంకాను నామినేట్ చేశారు. ఆ తర్వాత శుభ శ్రీ రతిక , అమర్ దీప్ ను నామినేషన్స్ లో ఉంచింది.

Bigg Boss 7 Telugu: ఓరినీ యేషాలో.. అమర్ దీప్‌కు కాలేదాకా చేసిన ప్రశాంత్..
Bigg Boss 7 Telugu
Rajeev Rayala
|

Updated on: Sep 27, 2023 | 7:35 AM

Share

బిగ్ బాస్ లో నామినేషన్స్ మంచి హాట్ హాట్ గా జరుగుతున్నాయి. సోమవారం నుంచి నామినేషన్స్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. హౌస్ లో పవర్ అస్త్ర సాధించిన ముగ్గురు మెంబర్స్ నుం జ్యురీ గా ఉంచి ఒకొక్కరు ఇద్దరినీ నామినేషన్స్ లో ఉంచి సరైన రీజన్ చెప్పాలని వారు చెప్పిన రీజన్స్ కు జ్యురీ కన్విన్స్ అయితే వారిని నామినేట్ అయినట్టు అనౌన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ ప్రక్రియలో వాదనలు గట్టిగానే జరిగాయి. ముందుగా ప్రిన్స్ ప్రియాంకా. తేజను నామినేషన్స్ లో ఉంచాడు. యావర్ చెప్పిన రీజన్స్ కు ప్రియాంకాను నామినేట్ చేశారు. ఆ తర్వాత శుభ శ్రీ రతిక , అమర్ దీప్ ను నామినేషన్స్ లో ఉంచింది. సుబ్బు చెప్పిన రీజన్స్ కు రతికా నామినేట్ అయినట్టు అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో రతిక, సుబ్బు మధ్య గట్టిగానే వాదన జరిగింది.

ఆ తర్వాత గౌతమ్ ప్రిన్స్ ను తేజను నామినేషన్స్ లో ఉంచాడు. ఈ క్రమంలోనే యావర్ , గౌతమ్ మధ్య గట్టిగానే జరిగింది. ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్ళారు. యావర్ మరోసారి తన కోపాన్ని చూపించాడు. పాపం గౌతమ్ సహనంగా చెప్తున్నా కూడా వినిపించుకోకుండా రెచ్చిపోయాడు. దాంతో గౌతమ్ కూడా యావర్ పై సీరియస్ అయ్యాడు. ఆతర్వాత జ్యురీ పైన కూడా అరిచి గోల చేశాడు యావర్. ఇక రెండో రోజుకూడా ఇదే గొడవలు కంటిన్యూ అయ్యింది.

ఫైనల్ గా ప్రిన్స్ ను నామినేట్ చేశారు జ్యురీ మెంబర్స్. ఇక అమర్ దీప్ సుబ్బు ను ప్రశాంత్ ను నామినేషన్స్ లో ఉంచాడు. బోనులోకి వస్తూనే ప్రశాంత్ కొంచం ఓవర్ చేసినట్టు అనిపించింది. బుద్దిమంతుడులా కావాలని బటన్స్ ఫుల్ గా పెట్టుకొని, కప్స్ పెట్టుకొని బోనుకు దండం పెడుతూ ..  కావాలని నటించాడు. దాంతో అమర్ కు కాలింది. ఓరినీ యాశలో అని అనుకున్నాడు. ఆతర్వాత అమర్ దీప్ ప్రశాంత్ రెండు మొఖాలతో నటిస్తున్నాడు అని అన్నాడు. బిగ్ బా ముందు ఏడుస్తున్నాడు. బయట మాములుగా ఉంటున్నాడు. మాస్క్ తీసేసి గేమ్ ఆడమని చెప్పినా కూడా ప్రశాంత్ నటిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. దానికి ప్రశాంత్ అన్న రెండు మొఖాలు అంటే ఎట్లుంటాయి.. అంటూ యాటకారంగా మాట్లాడాడు. దానికి ప్రశాంత్ నవ్వుతు సమాధానం చెప్తుంటే అమర్ కు మరింత కాలింది.. రేయ్.. నువ్వు సెగలుగా నవ్వొద్దు చెప్తున్నాను? అంటూ సీరియస్ అయ్యాడు. ప్రశాంత్ కూడా ఎక్కడా తగ్గకుండా అమర్ దీప్ తో వాదించాడు. పల్లవి ప్రశాంత్ అంటే ఒక్కడే ఉన్నాడు. అది నేనే అంటూ అమర్ పై అరిచాడు. మొదటి వారంలో ఇలానే అమర్ సీరియల్ యాక్టింగ్ చేసి ప్రశాంత్ కు సపోర్ట్ పెంచేశాడు. ఇక ఇప్పుడు కూడా అదే పనికిమాలిన వాదన చేశాడు. కానీ జ్యురీ అమర్ చెప్పిన రీజన్స్ సిల్లీగా ఉన్నాయి అంటూ కొట్టిపారేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us