Bigg Boss 7 Telugu: టికెట్ టూ ఫినాలే రేసులో అమర్ దీప్.. స్కోర్ బోర్డులో పరుగులు.. డాక్టర్ బాబు ఓవర్ కాన్ఫిడెంట్..
ఇప్పటివరకు అమర్ దీప్ అత్యధిక పాయింట్లతో టాప్ స్థానంలో ఉన్నాడు. ఇక అతని తర్వాత అర్జున్, తర్వాత ప్రశాంత్, గౌతమ్ ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్లో మరోసారి ప్రియాంకతో జరిగిన వివాదాన్ని సాగదీశాడు అమర్. నాకు ఇప్పటివరకు అర్జున్ అన్న ఒక్కడే టార్గెట్.. కానీ ఇప్పుడు నువ్వు గౌతమ్ కు పాయింట్స్ ఇవ్వడంతో లెక్కరు మారిపోయాయి. వెనక్కి లాగేసిన వాళ్లకే మార్కులు ఇచ్చావ్.. కనీసం ఫ్రెండ్ అని కూడా చూడలేదు. రాంగ్ డెసిషన్ తీసుకున్నావ్ అదే నా బాధ అంటూ ప్రియాంక దగ్గర బాధపడ్డాడు అమర్.
ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 7 ఫినాలే అస్త్ర గెలుచుకోవడానికి కంటెస్టెంట్స్ బాగానే కష్టపడుతున్నారు. ఇప్పటికే శోభా, ప్రియాంక, శివాజీ ఈ రేసు నుంచి అవుట్ కావడంతో ప్రశాంత్, యావర్, అమర్, గౌతమ్, అర్జున్ టికెట్ టూ ఫినాలే గెలుచుకోవడానికి పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటివరకు అమర్ దీప్ అత్యధిక పాయింట్లతో టాప్ స్థానంలో ఉన్నాడు. ఇక అతని తర్వాత అర్జున్, తర్వాత ప్రశాంత్, గౌతమ్ ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్లో మరోసారి ప్రియాంకతో జరిగిన వివాదాన్ని సాగదీశాడు అమర్. నాకు ఇప్పటివరకు అర్జున్ అన్న ఒక్కడే టార్గెట్.. కానీ ఇప్పుడు నువ్వు గౌతమ్ కు పాయింట్స్ ఇవ్వడంతో లెక్కరు మారిపోయాయి. వెనక్కి లాగేసిన వాళ్లకే మార్కులు ఇచ్చావ్.. కనీసం ఫ్రెండ్ అని కూడా చూడలేదు. రాంగ్ డెసిషన్ తీసుకున్నావ్ అదే నా బాధ అంటూ ప్రియాంక దగ్గర బాధపడ్డాడు అమర్. అయితే ప్రియాంక మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది.
ఇక తర్వాత ఫినాలే అస్త పోటీలో ఆరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో టర్నింగ్ వికెట్ అంటూ క్రికెట్ టాస్క్ ఇవ్వగా.. పిచ్ పై ఉన్న వికెట్స్ టర్న్ అవుతూ ఉంటే.. ఫీల్డర్స్ సర్కిల్ బయట ఉండి రింగ్స్ విసరాల్సి ఉంటుంది. ఎవరికి ఎక్కువ వికెట్స్ పడతాయో ఆ వికెట్ పై సూచించిన స్కోర్ వాళ్ల సొంతం అవుతుంది. ఈ టాస్కుకు శోభా, ప్రియాంకను సంచాలకులుగా నియమించారు. ఇందులో రూల్స్ ప్రకారం బజర్ మోగిన తర్వాత రింగ్స్ వేయాలి. బజర్ మోగిన తర్వాత వేసిన రింగ్ కౌంట్ కాదు. అయితే ఈ టాస్కులో ముందుగా అర్జున్ ను అవుట్ చేశారు ప్రియాంక, శోభా.
అయితే వికెట్ పడని రింగులను సంచాలకులు తిరిగి ఇవ్వొచ్చని చెప్పారు. దీంతో వాళ్లకు నచ్చినట్లుగానే నచ్చినవారికి ఎక్కువగా రింగ్స్ వేశారు. ఇక మొదటి రౌండులో ప్రశాంత్ కు రింగ్ ఇవ్వలేదు. మొదట బజర్ మోగిన తర్వాత అర్జున్ రింగ్ పడడంతో అతడిని గేమ్ నుంచి తప్పించారు. అయితే బజర్ రాకముందే విసిరాను అంటూ అర్జున్ వాదించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక ఫస్ట్ రౌండ్ ముగిసే సమయానికి అమర్ కు 44, అర్జున్ 49, యావర్ 42, గౌతమ్ 31, ప్రశాంత్ 32 స్కోర్ సాధించారు. ఫస్ట్ రౌండ్ లో అందరికంటే ఎక్కవగా అర్జున్ పాయింట్స్ రాగా… తర్వాత అమర్ నిలిచారు. ఇక ఆ తర్వాత ఎస్కేప్ టాస్క్ జరిగింది. ఇందులో పల్లవి ప్రశాంత్ గెలవగా.. అర్జున్ చివరి స్థానంలో నిలిచాడు. ఈ టాస్క్ తర్వాత యావర్ ఫినాలే అస్త్ర రేసు నుంచి తప్పుకోవడంతో అతని పాయింట్స్ మరెవరికైనా ట్రాన్స్ ఫర్ చేయాలని అన్నారు బిగ్ బాస్.. దీంతో వెంటనే ప్రశాంత్ కు తన పాయింట్స్ ఇవ్వడంతో స్కోర్ బోర్డులో ప్రశాంత్ మూడవ స్థానంలోకి చేరిపోయాడు.
ఇక తర్వాత సెన్సెన్స్ టాస్క్ ఇచ్చారు. అందులో కంటెస్టెంట్స్ కళ్లకు గంతలు కట్టుకుని వారి ముందే పెట్టిన వస్తువు ఏంటో గెస్ చేయాలి. ఈ ఆటలో ప్రశాంత్, అమర్ పోటీపడగా.. అర్జున్ చివర్లో ఉండిపోయాడు. ఇక తర్వాత వీరికి బ్యాలెన్స్ ది బాల్ టాస్క్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ అంతా ఒక చేతిలో బాల్ పట్టుకుని ఉండాలి.. కాళ్లు నేలకు తాకకుండా ఉండేలా ఒక నీళ్లు ఉన్న బకెట్ ను తాడును కట్టి దాంతో వారి కాళ్లకు కట్టేస్తారు. అలా ఎక్కు సేపు బ్యాలెన్స్ చేస్తారో వారే విన్నర్. అయితే ఈ టాస్క్ స్టార్ట్ కాకముందు గౌతమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించాడు. నిన్ను ఓడిస్తా చూడు అంటూ అమర్ తో ఛాలెంజ్ చేశాడు. ఇందులో ముందుగా అమర్ ఓడిపోగా.. ఆ వెంటనే గౌతమ్ ఓడిపోయాడు. ఇక చివరకు ప్రశాంత్ గెలిచాడు. ప్రస్తుతం ప్రశాంత్, అమర్ ఇద్దరి స్కోర్ సమానంగా ఉన్నాయి.