- Telugu News Photo Gallery Cinema photos Tollywood 2023 Flop Movies Business goes viral Telugu Entertainment Photos
Tollywood: ఎంత హిట్ కాంబోకైనా ఫుల్‌స్టాప్ పడి తీరాల్సిందేనా.?
డబ్బులు ఎక్కువ వస్తాయంటే, సినిమాకు ఖర్చు పెట్టడానికి ఎప్పుడూ వెనకాడరు నిర్మాతలు. అంతంత బిజినెస్‌లు, తమ ఫేస్ వేల్యూ తోనే జరుగుతున్నాయని అంటారు స్టార్లు. అందుకే సినిమా సినిమాకీ రెమ్యునరేషన్లను అమాంతం పెంచేస్తారు. ఇవి రెండూ ప్యారలల్‌గా జరుగుతున్నంత వరకు ఎవరికీ ఇబ్బంది లేదు. అదే షీట్‌లో బ్యాలన్స్ తప్పితే... ఫలితం ఏంటి? ఎంత హిట్ కాంబోకైనా ఫుల్‌స్టాప్ పడి తీరాల్సిందేనా?.. డీటైల్డ్ గా చూసేద్దాం రండి.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Nov 30, 2023 | 9:51 PM

డబ్బులు ఎక్కువ వస్తాయంటే, సినిమాకు ఖర్చు పెట్టడానికి ఎప్పుడూ వెనకాడరు నిర్మాతలు. అంతంత బిజినెస్‌లు, తమ ఫేస్ వేల్యూ తోనే జరుగుతున్నాయని అంటారు స్టార్లు. అందుకే సినిమా సినిమాకీ రెమ్యునరేషన్లను అమాంతం పెంచేస్తారు.

ఇవి రెండూ ప్యారలల్‌గా జరుగుతున్నంత వరకు ఎవరికీ ఇబ్బంది లేదు. అదే షీట్‌లో బ్యాలన్స్ తప్పితే... ఫలితం ఏంటి? ఎంత హిట్ కాంబోకైనా ఫుల్‌స్టాప్ పడి తీరాల్సిందేనా?.. డీటైల్డ్ గా చూసేద్దాం రండి.

సినిమాలో కంటెంట్ కొత్తగా ఉండి, జనాలను థియేటర్లకు రప్పించే సత్తా ఉంటే ఖర్చు పెట్టడానికి నిర్మాత ఎప్పుడూ వెనకాడరు. హీరోకి రూపాయి ఎక్కువిచ్చి మరీ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేక్షకులు తెగ చూస్తారన్న నమ్మకం ఉంటే ఓటీటీలు కూడా అలాగే కాసులు పోసి సినిమాలు కొనుగోలు చేస్తాయి.

కానీ ఎంతో భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో సినిమాలను కొన్నప్పుడు వాటికి సరిగా వ్యూస్ రాకపోతే... జనాల మనసుల్ని గెలవలేకపోతే? సరిగ్గా ఇలాంటి సందర్భాల్లోనే సినిమాలను కొనడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి ఓటీటీ సంస్థలు.

స్టార్ల రెమ్యునరేషన్‌కీ, నిర్మాతలు లావిష్‌గా పెట్టే ఖర్చుకీ, థియేట్రికల్ బిజినెస్‌లకీ ఎక్కడా పొంతన ఉండటం లేదు. ఆ డిఫరెన్సును కవర్ చేస్తాయనుకున్న ఓటీటీలు కూడా ఇప్పుడు దూకుడు ప్రదర్శించడం లేదు. డిజిటల్ మార్కెట్ ఆచితూచి అడుగులు వేయడంతో అసలు డైలమా మొదలవుతుంది. బ్యాలన్స్ షీట్ లెక్కల్లో తేడాలొస్తున్నాయి.

సినిమాలో సరుకు లేకుండా, కేవలం కాంబినేషన్ల మీద ఎంతైనా ఖర్చుపెడతామంటే ఇక చెల్లదు. కోవిడ్ టైమ్‌లో స్పీడు మీదున్న ఓటీటీలు, ఇప్పుడు యాక్సలరేటర్ నుంచి కాలు తీసి, బ్రేక్ మీద పెట్టేశాయి. ఎక్కడికక్కడ లెక్కలు వేసుకుంటూ, స్పీడో మీటర్‌ని చెక్ చేసుకుంటున్నాయి. రీసెంట్‌గా ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో సక్సెస్‌ఫుల్ డైరక్టర్, హీరో కాంబోతో సినిమా స్టార్ట్ కావాల్సింది.

కానీ ఈ బ్యాలన్స్ షీట్ కుదరకపోవడం వల్లనే షెల్వ్ అయింది. కళ్ల ముందున్న ఈ ఎగ్జాంపుల్‌తో ఇంకా ప్రారంభం కాని చాలా ప్రాజెక్టులు పునరాలోచనలో పడ్డాయనే మాట వినిపిస్తోంది. ఓటీటీలను నమ్ముకుని భారీగా ఖర్చుపెట్టాలనుకున్న నిర్మాతలు ఒకటికి పది సార్లు ఆలోచించాలి, ఆ తర్వాతే రంగంలోకి దిగాలనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి.





























