Bigg Boss 7 Telugu: శివాజీకి సిక్రెట్ టాస్క్.. రవితేజను దించేసిన అమర్ దీప్.. ప్రోమో అదిరిపోయింది..
బిగ్బాస్ ఇచ్చిన పార్టీలో ఫుల్గా లాగించేశారు హౌస్మేట్స్. ఇక లివింగ్ ఏరియాలోనే కూర్చున్న అమర్ దీప్, అర్జున్.. ఏదో టాస్క్ రాబోతుందని ఊహించేశారు. ఇక అనుకున్నట్లు వాళ్లిద్దరిని పోలీసులుగా మార్చేసి ఇంట్లో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి రంగంలోకి దింపారు బిగ్బాస్. ఈరోజుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో విక్రమార్కుడు రవితేజను దించేశాడు అమర్ దీప్. మాస్ మాహారాజా నడక..
ఇంటిసభ్యులకు ఫుడ్ ట్రీట్ ఇచ్చాడు బిగ్బాస్. అదే సమయంలో హౌస్లో మిస్ బిగ్బాస్ హత్య జరిగింది. నిన్నటి ఎపిసోడ్లో బిగ్బాస్ ఇచ్చిన పార్టీలో ఫుల్గా లాగించేశారు హౌస్మేట్స్. ఇక లివింగ్ ఏరియాలోనే కూర్చున్న అమర్ దీప్, అర్జున్.. ఏదో టాస్క్ రాబోతుందని ఊహించేశారు. ఇక అనుకున్నట్లు వాళ్లిద్దరిని పోలీసులుగా మార్చేసి ఇంట్లో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి రంగంలోకి దింపారు బిగ్బాస్. ఈరోజుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో విక్రమార్కుడు రవితేజను దించేశాడు అమర్ దీప్. మాస్ మాహారాజా నడక.. స్టైల్.. యాటిట్యూడ్.. కామెడీ టైమింగ్ అదరగొట్టేశాడు. ఇక కామెడీ టైమింగ్ పంచులతో శివాజీ రెచ్చిపోయాడు. ఇక యావర్, శోభా, రతిక, గౌతమ్ తమ పాత్రలలో జీవించేశారు.
ప్రోమోలో.. ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్.. కానిస్టేబుల్ కాంజిత్ అని అర్జున్ చెప్పగా.. కానిస్టేబుల్ కాదు.. మీతో పాటు నన్ను కూడా ఎస్ఐ అనే చెప్పారక్కడ అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు అమర్ దీప్. ఇక శోభా, అశ్విని లేడీ రిపోర్టర్స్.. వీళ్లు బ్రేకింగ్స్ కోసం ఒకరితో ఒకరు పోటీపడుతుంటారు. రతిక బిగ్బాస్ వైఫ్ డ్రైవర్.. గౌతమ్ వంట చేసేవాడు. ఇక యావర్, ప్రియాంక బిగ్బాస్ వైఫ్ పనోళ్లుగా కనిపించారు. నేనెప్పుడైనా నీతో మాట్లాడాలంటే నీకు ఇట్లా కన్ను కొడతా.. నువ్వు పక్కకు వచ్చెయ్ అని రతిక గౌతమ్ తో చెప్పడంతో ఏంటీ మళ్లీ కొట్టు అని అడిగాడు. దీంతో రతిక కన్ను కొట్టడంతో ఏయ్ మంచిగ కొట్టినవ్ లే అంటూ రతికను గిల్లడం.. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. ఇక బిగ్బాస్ భార్యకు గుమాస్తాగా శివాజీ కనిపించాడు.
యావర్ కింద పడుకుని ఏడుస్తూ దొర్లుంతుంటే.. రేయ్ యావరూ..మరీ ఓవర్ గా ఉంది.. అంత ఏడ్వకండ్రా అంటూ పంచ్ వేశాడు శివాజీ. పోయింది మా మేడమ్ కదా సార్.. ఫీలింగ్ ఉంటుంది కదా అని ప్రియాంక అనడంతో నాకు ఏమానా పెళ్లామా ?.. నాకూ మేడమే కదమ్మా అంటూ మరో పంచ్ వేశాడు శివాజీ. చివరకు శివాజీ, ప్రశాంత్ ఇద్దరిని కన్ఫెషన్ రూంకు పిలిచిన బిగ్బాస్ శివాజీకి సీక్రెట్ టాస్క్ గురించి మాట్లాడారు. అలాగే శివాజీకి ఓ చైన్ కూడా ఇవ్వడంతో ప్రోమో ముగిసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.