Bigg Boss 7 Telugu: ఆటలో వేట.. శోభా శెట్టి కోసం రెచ్చిపోయి ఆడిన అమర్ దీప్..
ప్రతివారం ఇప్పటి నుంచి బాగా ఆడతా..అంటూ మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు మనోడు ఫామ్ లోకి వచ్చాడు. బిగ్ బాస్ 9వారం లో అమర్ దీప్ హైలైట్ అయ్యాడనే చెప్పాలి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో విన్ అయ్యాడు.. తన టీమ్ ను గెలిపించాడు. ఇక నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో తన పార్ట్నర్ శోభను గెలిపించి కెప్టెన్ ను చేశాడు. నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగం గా వీరసింహాలు టీమ్ బ్లాక్ బాల్ సొంతం చేసుకోవడంతో..
బిగ్ బాస్ సీజన్ 7 మొదలైన దగ్గర నుంచి నేనేంటో చూపిస్తా.. ? నా ఆట చూపిస్తా అంటూ మాటలు చెప్తున్నాడు అమర్ దీప్.. కానీ భోలే చెప్పినట్టు అమర్ ఇరగదీసింది ఏమి లేదనే చెప్పాలి. ప్రతివారం ఇప్పటి నుంచి బాగా ఆడతా..అంటూ మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు మనోడు ఫామ్ లోకి వచ్చాడు. బిగ్ బాస్ 9వారం లో అమర్ దీప్ హైలైట్ అయ్యాడనే చెప్పాలి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో విన్ అయ్యాడు.. తన టీమ్ ను గెలిపించాడు. ఇక నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో తన పార్ట్నర్ శోభను గెలిపించి కెప్టెన్ ను చేశాడు. నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగం గా వీరసింహాలు టీమ్ బ్లాక్ బాల్ సొంతం చేసుకోవడంతో .. పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. గర్జించే పులులు టీమ్ నుంచి బాల్స్ ను స్వాప్ చేసుకోవాలని చెప్పాడు. దాంతో గర్జించే పులులు దగ్గరున్న బాల్స్ ను తీసుకోవడంతో ..వీరసింహాలు టీమ్ విన్ అయ్యింది.
దాంతో వీరసింహాలు టీమ్ కెప్టెన్సీ కోసం పోటీ పడాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. అయితే కెప్టెన్సీ రేస్ లో ఉన్న వారు గర్జించే పులులు టీమ్ నుంచి ఒకొక్కరిని తమ పార్ట్నర్ గా ఎంచుకోవాలి అని చెప్పాడు. ఆతర్వాత కెప్టెన్సీ రేస్ లో ఉన్న వారు ఫొటోలతో ఉన్న బ్యాగ్ లో ధర్మకోల్ బాల్స్ ఉంచి. ఆ బ్యాగ్ ను కాపాడుకుంటూ ఓ సర్కిల్ ఇచ్చి అందులో తిరగాలి అని చెప్పాడు. ఎవరి బ్యాగ్ లో అయితే తక్కువ బాల్స్ ఉంటాయో వారు రేస్ నుంచి తప్పుకుంటారు అని చెప్పాడు బిగ్ బాస్.
దాంతో అర్జున్ కోసం శివాజీ, రతిక కోసం భోలే, శోభా కోసం అమర్, తేజ కోసం ప్రియాంక, గౌతమ్ కోసం అశ్విని గేమ్ లోకి దిగారు. భుజాన సంచి వేసుకొని రింగ్ లో తిరగడం మొదలై పెట్టారు. ఇక గేమ్ మొదలైన దగ్గర నుంచి అమర్ రెచ్చిపోయి ఆడాడు. తన స్టామినా చూపిస్తూ.. రింగ్ లో ఉన్న వారి బ్యాగ్ లోని బాల్స్ ను ఖాళీ చేశాడు. ముందుగా అమర్ భోలెను టార్గెట్ చేశాడు. భోలే సంచిని ఊపేసి లాగేసి బాల్స్ ను ఖాళీ చేశాడు. అయితే కొంత గ్యాప్ తీసుకొని అశ్వినిని టార్గెట్ చేశాడు. అశ్విని దగ్గర ఉన్న సంచిలో బాల్స్ లాగేసి కింద పడేసే క్రమంలో అశ్విని అమర్ ను కొట్టింది. దాంతో మనోడు మరింత రెచ్చిపోయాడు. అశ్విని బ్యాగ్ ను రెచ్చిపోయి లాగి లాగి బాల్స్ ను ఖాళీ చేశాడు. ఒక పక్క అమర్, మరో పక్క ప్రియాంక అశ్విని పై ఎటాక్ చేయడంతో ఆమె బ్యాగ్ ఖాళీ అయ్యింది. దాంతో ఆమె అవుట్ అయ్యింది. ఆ తర్వాత అమర్ భోలే పై ఎటాక్ చేసి తన సంచిలోని బాల్స్ నుంచి తగ్గించేశాడు. ఈ క్రమంలో భోలే, అమర్ కొట్టుకున్నంత పని చేశారు. అమర్ అగ్రసివ్ గా ఆడటంతో భోలే కూడా షాక్ అయ్యాడు. తిరిగి ఎటాక్ చేసే ప్రాయత్నం చేశాడు కానీ అమర్ మంచి ఫామ్ లో ఉండటంతో భోలే తేలిపోయాడు. దాంతో అతని బాల్స్ తగ్గిపోయి గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శివాజీ పై ప్రియాంక, అమర్ ఎటాక్ చేశారు. చెయ్యి నొప్పి కారణంగా శివాజీ గేమ్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. ఆతర్వాతిహా ప్రియాంక పై కూడా అదే రేంజ్ లో రెచ్చిపోయి ఆడాడు అమర్. ఆమె బ్యాగ్ ను లాగేసి ఊపేసి ఖాళీ చేశాడు. దాంతో అమర్ విన్ అయ్యాడు.. శోభా కెప్టెన్ అయ్యింది.