Mega Brothers: మా అన్నదమ్ముల బంధం చాలా ప్రత్యేకం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్.

Mega Brothers: మా అన్నదమ్ముల బంధం చాలా ప్రత్యేకం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్.

Anil kumar poka

|

Updated on: Nov 04, 2023 | 9:49 AM

మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్యల పెళ్లి నవంబర్ 1న ఇటలీలో ఘనంగా జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ, ఇరు కుటుంబాలు, పలువురు హీరోలు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే దీని కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి.

మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్యల పెళ్లి నవంబర్ 1న ఇటలీలో ఘనంగా జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ, ఇరు కుటుంబాలు, పలువురు హీరోలు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే దీని కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. పెళ్ళికి సంబందించిన పలు ఫొటోలతోపాటు మెగా ఫ్యామిలీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా.. మెగా బ్రదర్ నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేశారు. తన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి దిగిని పిక్ ను షేర్ చేశారు. ఆ ఫొటోకు ఎమోషనల్ నోట్ ను కూడా యాడ్ చేశాడు.. మా మధ్య కూడా విభేదాలు, వాదనలు ఉంటాయి. అయినా మా ఈ బంధం ఎంతో ప్రత్యేకమైంది. జీవితంలో ఇప్పటివరకు చేసిన పనులనే కాదు.. జ్ఞాపకాలను కలిసే పంచుకున్నాం. మా మధ్య ఉన్న ఈ బంధం ఎంతో ముఖ్యమైనది. బలమైన జ్ఞాపకాలపై ఈ బంధం ఆధారపడి ఉంది. మా ముగ్గురి మధ్య ఉన్న ఈ బలమైన బంధానికి నేను మనసారా విలువనిస్తాను అంటూ ఎమోషనల్ కోట్ రాసుకొచ్చారు నాగబాబు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.