Bigg Boss 5 Telugu: నామినేషన్ ప్రక్రియలో సరికొత్త రికార్డ్.. షణ్ముఖ్‌కే దక్కిన ఘనత..
బిగ్ బాస్ సీజన్ 5లో ఎప్పటిలానే సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఆదివారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో.. ప్రస్తుతం హౌస్‌లో 15మంది ఉన్నారు.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో ఎప్పటిలానే సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఆదివారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో.. ప్రస్తుతం హౌస్‌లో 15మంది ఉన్నారు. మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడోవారం లహరి ఎలిమినేట్ కాగా రీసెంట్‌గా నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌తో బిగ్ బాస్ సీజన్ 30ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఇక నిన్నటి నామినేషన్ ప్రక్రియలో.. ఈ సారి నామినేషన్ ప్రక్రియలో ఒకొక్కరు ఇద్దరినీ నామినేట్ చేయాలనీ చెప్పాడు బిగ్ బాస్.దాంతో జెస్సీ .. యాంకర్ రవి- లోబోలను నామినేట్ చేయగా.. సన్నీ.. షణ్ముఖ్- ప్రియలను, విశ్వ.. జెస్సీ- షణ్ముఖ్ జస్వంత్‌లను, కాజల్.. యాంకర్ రవి-సన్నీ, లోబో.. మానస్- షణ్ముఖ్ , ప్రియాంక.. హమీదా-లోబో నామినేట్ చేశారు. అలాగే.. సిరి.. యాంకర్ రవి- హమీదా, యాంకర్ రవి.. జెస్సీ-షణ్ముఖ్ జస్వంత్‌లను నామినేట్ చేశాడు. ఇక ఆనీ మాస్టర్.. యాంకర్ రవి- విశ్వ, షణ్ముఖ్ జస్వంత్.. విశ్వ- మానస్, హమీదా.. ప్రియ- షణ్ముఖ్ జస్వంత్, శ్వేతా.. మానస్- కాజల్, ప్రియ.. షణ్ముఖ్ జస్వంత్- సన్నీ, మానస్.. జెస్సీ, షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామ్.. జెస్సీ- షణ్ముఖ్ జస్వంత్‌లను నామినేట్ చేశారు.
ఈ నామినేషన్ ప్రక్రియలో మునుపెన్నడు లేనివిధంగా షణ్ముఖ్‌ను ఏకంగా ఎనిమిది మంది నామినేట్ చేశారు. సన్నీ, విశ్వ, లోబో, రవి, హమీదా, ప్రియ, మానస్, శ్రీరామ్ అందరు షణ్ముఖ్‌ను నామినేట్ చేయడంతో షణ్ముఖ్ కాస్త ఫీల్ అయ్యాడు..
మరిన్ని ఇక్కడ చదవండి :