
ప్రశాంత్ వర్మ.. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ హిట్స్ అందుకుంటున్నాడు ఈ కుర్రదర్శకుడు. అ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమా తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాగే 2021లో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన తేజ హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక తమన్నా ప్రధాన పాత్రలో దట్ ఈజ్ మహాలక్ష్మీ అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
ఇక ఈ ఏడాది హనుమాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలను లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో తేజ సజ్జ కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. హనుమంతుడి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మహా కాళీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కాళీ మాత గెటప్ లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? హనుమాన్ యూనివర్ పేరుతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మహాకాళి అనే సినిమాను చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా భూమీ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ అమ్మడు తెలుగులో పలు సీరియల్స్ లో నటించింది. అలాగే షరతులు వర్తిస్తాయి అనే సినిమా చేసింది. మొనీమధ్య వచ్చిన కింగ్ డమ్ సినిమాలోనూ నటించింది భూమీ. ఇక ఇప్పుడు మహాకాళీ సినిమాలో మెయిన్ రోల్ లో నటించనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ 50శాతం పూర్తయ్యిందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.