MAA Elections: ‘మా’ ఎన్నికలపై జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో జోరుగా బెట్టింగ్ .. లక్షల్లో పందేలు
MAA Elections: ఈ సారి 'మా' ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నట్లు జరిగాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ కు , మంచు విష్ణు ప్యానల్ కు..
MAA Elections: ఈ సారి ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నట్లు జరిగాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ కు , మంచు విష్ణు ప్యానల్ కు మధ్య పోటీ నున్నా నేనా అన్నట్లు సాగింది. దీంతో రాజకీయ ఎన్నికలను తలపిస్తూ ఎవరు గెలుస్తారంటూ బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. తాజాగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో బెట్టింగ్ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు అధ్యక్ష పదవికి ఫేవరేట్ అంటూ రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నట్లు సమాచారం. ఇక ఎక్కువ మంది మంచు విష్ణు గెలుస్తారంటూ ఫేవరేట్ గా పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్ లో వేల నుంచి లక్షల్లో డబ్బులు పెడుతున్నట్టు సమాచారం.
కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్, విష్ణుల్లో ఎవరు గెలుస్తారా అన్నదానిపై బెట్టింగ్ లు పెడుతున్నారు. ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతాన్ని బెట్టింగ్ రాయుళ్లు తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కౌంటింగ్ సమయంలో ప్రకాష్ రాజ్ ఈసీ, మురళీ మోహన్ తో వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. మరోవైపు విష్ణు ప్రకాష్ రాజ్ తో సెల్ఫీ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read: Maa Elections: ఈసారి ఓటు వేయని స్టార్ హీరోలు, హీరోయిన్లు వీరే… చివరి నిమిషంలో అనసూయ ఓటు..