‘బీట్స్​ ఆఫ్ రాధేశ్యామ్’ : డార్లింగ్ ఖాతాలో నయా రికార్డ్ !

ప్రభాస్ అంటేనే రికార్డులు..రికార్డులు అంటేనే ప్రభాస్ అన్నట్లుగా తయారయ్యింది ప్రజంట్ పరిస్థితి. బాహుబలి కలెక్షన్ల రికార్డును  ఇప్పట్లో చెరిపేయడం....

'బీట్స్​ ఆఫ్ రాధేశ్యామ్' : డార్లింగ్ ఖాతాలో నయా రికార్డ్ !
Ram Naramaneni

|

Oct 24, 2020 | 10:42 PM

ప్రభాస్ అంటేనే రికార్డులు..రికార్డులు అంటేనే ప్రభాస్ అన్నట్లుగా తయారయ్యింది ప్రజంట్ పరిస్థితి. బాహుబలి కలెక్షన్ల రికార్డును  ఇప్పట్లో చెరిపేయడం  అసాధ్యం కాబట్టి ఆ సినిమాను వదిలేసి నాన్-బాహుబలి రికార్డులు లెక్కగడుతున్నారు. తాజాగా డార్లింగ్ ప్రభాస్ పుట్టిన  రోజు సందర్భంగా విడుదల చేసిన ‘బీట్స్​ ఆఫ్ రాధేశ్యామ్​’ మరో క్రేజీ  రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా భారత సినీ చరిత్రలో నయా రికార్డును సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే 15 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన తొలి మోషన్​ పోస్టర్​గా నిలిచింది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. కాగా ఈ సినిమాను జాతకం ఆధారంగా ఉన్న స్టోరీతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తుండగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu