‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ షూటింగ్ పూర్తి

టాలీవుడ్​ యంగ్ హీరో సుశాంత్ మంచి నటుడు. ఎంత కెపాసిటీ లేకపోతే త్రివిక్రమ్ అతడికి అల..వైకుంఠపురం సినిమాలో అంత మంచి పాత్ర ఇస్తారు చెప్పండి.

'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' షూటింగ్ పూర్తి

టాలీవుడ్​ యంగ్ హీరో సుశాంత్ మంచి నటుడు. ఎంత కెపాసిటీ లేకపోతే త్రివిక్రమ్ అతడికి అల..వైకుంఠపురం సినిమాలో అంత మంచి పాత్ర ఇస్తారు చెప్పండి. కాగగా సుశాంత్ తాజాగా ​ ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శనివారంతో కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్​ చేశారు సుశాంత్​. ఈ సినిమాతో దర్శన్​ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్​ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. డిసెంబరులో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అది థియేటర్లలోనా లేదంటే ఓటీటీ అనేది తెలియాల్సి  ఉంది.

Also Read :

అక్కడ బుల్లెట్‌కు పూజలు, గుడి కూడా కట్టేశారు !

వీసా కోసమే పెళ్లి..రాధికా ఆప్టే సంచలన స్టేట్మెంట్