పైరసీని తరిమికొట్టండి..అభిమానులకు బాలయ్య పిలుపు

పైరసీపై గళం విప్పారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ.  సినీ నిర్మాతల్ని తీవ్ర నష్టాలు మిగుల్చుతున్న పైరసీని అరికట్టాలని పిలుపునిచ్చారు.

  • Ram Naramaneni
  • Publish Date - 5:16 pm, Sat, 24 October 20
పైరసీని తరిమికొట్టండి..అభిమానులకు బాలయ్య పిలుపు

పైరసీపై గళం విప్పారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ.  సినీ నిర్మాతల్ని తీవ్ర నష్టాలు మిగుల్చుతున్న పైరసీని అరికట్టాలని పిలుపునిచ్చారు. బాలయ్య దర్శకత్వం వహించి, నటించిన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’ ను తాజాగా విడుదల చేశారు. దివంగత సీనియర్ ఎన్టీఆర్ హిట్‌ ‘నర్తనశాల’పై ఎంతో మక్కువతో బాలయ్య రీమేక్‌ చేయాలని భావించారు. అర్జునుడిగా ఆయన, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్‌బాబు నటించారు. కానీ సౌందర్య చనిపోవడం..ఇతరిత్రా  కారణాల వల్ల చిత్రం నిర్మాణం సగంలోని ఆగిపోయింది. షూటింగ్ కంప్లీట్ చేసిన సన్నివేశాలను ఫ్యాన్స్ కోరిక మేరకు విడుదల చేశారు. 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాల్ని విజయదశమి సందర్భంగా శనివారం శ్రేయాస్‌ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్‌లో రిలీజ్ చేశారు.

‘నర్తనశాల’ సినిమా ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు బాలయ్య ప్రకటించారు. పైరసీ నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగుల్చుతోన్న నేపథ్యంలో ఆయన అభిమానులకు సందేశం ఇచ్చారు. ‘అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు వందనాలు. పైరసీ పట్ల మనమంతా అలెర్ట్‌గా ఉండాలి, దాన్ని రూపుమాపాలి. కేవలం శ్రేయాస్‌ ఈటీ మీడియా ద్వారా మాత్రమే ‘నర్తనశాల’ను చూసి ఆనందించడం. ప్రతి ఫ్యాన్ ఓ సైనికుడిలా మారాలని, పైరసీని అరికట్టేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.