వీసా కోసమే పెళ్లి..రాధికా ఆప్టే సంచలన స్టేట్మెంట్

బాలీవుడ్ భామ రాధికా ఆప్టే ఏం చేసినా సంచలనమే. తెలుగులో 'రక్త చరిత్ర', 'లెజెండ్‌', 'లయన్‌' చిత్రాలలో కనిపించిన ఈ భామ తాజాగా ఓ సంచలన స్టేట్మెంట్  ఇచ్చింది.

వీసా కోసమే పెళ్లి..రాధికా ఆప్టే సంచలన స్టేట్మెంట్
Ram Naramaneni

|

Oct 24, 2020 | 9:49 PM

బాలీవుడ్ భామ రాధికా ఆప్టే ఏం చేసినా సంచలనమే. తెలుగులో ‘రక్త చరిత్ర’, ‘లెజెండ్‌’, ‘లయన్‌’ చిత్రాలలో కనిపించిన ఈ భామ తాజాగా ఓ సంచలన స్టేట్మెంట్  ఇచ్చింది. కేవలం వీసా కోసం మాత్రమే మ్యారేజ్ చేసుకున్నానని చెప్పి, అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2012లో రాధిక బ్రిటిష్‌ మ్యుజిషియన్‌ బెనెడిక్ట్ టేలర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కూడా నటనపై ఫోకస్ పెట్టి.. మూవీ షూటింగ్‌ల కోసం ఎక్కువ రోజులు ఇండియాలోనే ఉన్నారు.

రాధిక తాజాగా తన పెళ్లి గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘మీకు ఎప్పుడు వివాహమైంది?’ అని ప్రశ్నించగా.. ‘ ఫారెన్‌లో ఉన్న వ్యక్తితో పెళ్లి జరిగితే వీసా ఈజీగా వస్తుందని తెలుసుకున్న తర్వాత చేసుకున్నా. నా వరకు జీవితానికి బార్డర్స్ లేవు. నేను పెళ్లిని నమ్మే వ్యక్తిని కాదు. ఈ వ్యవస్థపై నాకు నమ్మకాలు లేవు. వీసా పొందడం ప్రాబ్లం అని తెలిసినప్పుడు  పెళ్లి చేసుకున్నా. అందులోనూ మేమిద్దరం కలిసి జీవించాలి అనుకున్నాం’ అని చెప్పింది.

లాక్‌డౌన్ ప్రారంభం‌ నుంచి రాధిక లండన్‌లోనే ఉన్నారు. ఈ సమయంలో వ్యాయామం చేసి ఫిట్‌గా మారానని, మంచి ఫుడ్ తీసుకున్నానని అన్నారు. కొత్త స్టోరీస్ రాస్తూ, సినిమాలు చూశానని చెప్పారు.

Also Read:

అక్కడ బుల్లెట్‌కు పూజలు, గుడి కూడా కట్టేశారు !

Breaking : హత్రాస్ కేసు విచారణ అధికారి భార్య ఆత్మహత్య

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu