Balakrishna – Mokshagna: బాలయ్య వారసుడొచ్చేశాడు.. మోక్షజ్ఞ న్యూలుక్ పోస్టర్ చూశారా..? డైరెక్టర్ ఎవరంటే..

కొన్ని రోజులుగా సింబా వచ్చేస్తున్నాడంటూ #PVCU అంటూ నందమూరి అభిమానులలో క్యూరియాసిటీని పెంచేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తాజాగా మోక్షజ్ఞ కొత్త సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సింబా ఈజ్ కమింగ్ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆయన లుక్ రిలీజ్ చేశారు.

Balakrishna - Mokshagna: బాలయ్య వారసుడొచ్చేశాడు.. మోక్షజ్ఞ న్యూలుక్ పోస్టర్ చూశారా..? డైరెక్టర్ ఎవరంటే..
Mokshagna
Follow us

|

Updated on: Sep 06, 2024 | 11:06 AM

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. హనుమాన్ సినిమాతో సెన్సెషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య నటవారసుడిని వెండితెరకు పరిచయం చేయనున్నాడు. కొన్ని రోజులుగా సింబా వచ్చేస్తున్నాడంటూ #PVCU అంటూ నందమూరి అభిమానులలో క్యూరియాసిటీని పెంచేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తాజాగా మోక్షజ్ఞ కొత్త సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సింబా ఈజ్ కమింగ్ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆయన లుక్ రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ మోక్షజ్ఞకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే మొదటి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

తాజాగా ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసిన పోస్టర్ లో మోక్షజ్ఞ లుక్ అదిరిపోయింది. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ.. ఇప్పుడు మాత్రం ఊహించని రేంజ్ ‏లో స్టైలీష్ లుక్ లో కనిపించారు. దీంతో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ కావడం పక్కా అంటూ ధీమా తెలియజేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. గత రెండు రోజులుగా మోక్షజ్ఞ సినీ అరంగేట్రం గురించి ప్రశాంత్ వర్మ వరుస పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం అంటూ వరుస పోస్టులు పెట్టడంతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ముందే హింట్ ఇచ్చేశాడు.

ఇవి కూడా చదవండి

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్టుగా రానున్న ఈ సినిమాతో మోక్షజ్ఞ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఈ యూనివర్స్ కు 20 స్క్రిప్టులు సిద్ధమవుతున్నాయని.. తొలి ఫేజ్ లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని గతంలోనే ప్రశాంత్ వర్మ వివరించారు. ఇప్పుడు సెకండ్ ప్రాజెక్టులోనే మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.

ప్రశాంత్ వర్మ ట్వీట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.