Producer SKN: కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బు చెదలపాలు.. ‘బేబీ’ మూవీ నిర్మాత సాయం..

|

Nov 19, 2023 | 4:38 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం దాదాపు రూ.2 లక్షలు జమ చేశాడు. రోజంతా కష్టపడి సంపాదించిన ఆ డబ్బులను ఇంట్లో భద్రంగా దాచాడు. కానీ ఆ డబ్బుకు చెదలు పట్టింది. ఒక్క రూపాయి కూడా వినియోగించుకునేందుకు వీలు లేకుండా మొత్తం నాశనమయ్యాయి. దీంతో ఆ తండ్రి కంట కన్నీళ్లు ఆగడం లేదు. కూతురి పెళ్లికి దాచిన డబ్బంతా బుడిదపాలు కావడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనానీతం.

Producer SKN: కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బు చెదలపాలు.. బేబీ మూవీ నిర్మాత సాయం..
Producer Skn
Follow us on

ఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రం బేబీ. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. బేబీ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. బేబీ సినిమా, నటీనటుల గురించి వచ్చిన పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్ పై రిప్లై ఇస్తూ నెటిజన్లకు మరింత దగ్గరయ్యాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ పేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కూతురి పెళ్లి కోసం కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం చెదల పాలు కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నిర్మాత ఎస్కేఎస్ వారికి సాయం చేస్తానని ట్వీట్ చేశారు.

అసలు విషయానికి వస్తే.. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం దాదాపు రూ.2 లక్షలు జమ చేశాడు. రోజంతా కష్టపడి సంపాదించిన ఆ డబ్బులను ఇంట్లో భద్రంగా దాచాడు. కానీ ఆ డబ్బుకు చెదలు పట్టింది. ఒక్క రూపాయి కూడా వినియోగించుకునేందుకు వీలు లేకుండా మొత్తం నాశనమయ్యాయి. దీంతో ఆ తండ్రి కంట కన్నీళ్లు ఆగడం లేదు. కూతురి పెళ్లికి దాచిన డబ్బంతా బుడిదపాలు కావడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనానీతం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా… ఆ తండ్రి కన్నీళ్లు చూసిన నిర్మాత ఎస్కేఎన్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఆ వీడియోకు రియాక్ట్ అవుతూ.. “ఇలా జరగడం చాలా బాధాకరం. డబ్బును అలా దాచుకున్న మీ అమాయకత్వాన్ని చూస్తే చాలా దురదృష్టమనిపిస్తోంది. ఆ తండ్రి వివరాలు తనకు పంపండి. ఆయన కుమార్తె పెళ్లికి అవసరమయ్యే రూ.2 లక్షల డబ్బును ఇస్తాను” అని తన ట్విట్టర్ లో తెలిపాడు. ఎస్కేఎన్ ట్వీట్ పై నెటిజన్స్ రకారకాలుగా స్పందిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. బ్యాంకులలో డబ్బులు దాచుకునేలా వారికి అవగాహన కల్పించాల్సిన భాద్యత అందరిపైన ఉందని ఎస్కేఎన్ ట్వీట్ చేయగా.. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘చాలా మంది ఇలాగే చేస్తున్నారని.. బ్యాంకులో వేసుకోవచ్చు గా అంటే ఆన్ లైన్ మోసాలు జరుగుతున్నాయి.. తెలియక ఏదైనా నొక్కితే ఫోన్ పేలో డబ్బులు పోతాయ్ గా అంటున్నారు’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో నిర్మాత ఎస్కేఎన్ స్పందిస్తూ.. చెక్ ట్రాన్సక్షన్ చేయండి.. ఆన్ లైన్ బ్యాంకింగ్ వద్దు అని చెప్పి బ్యాంక్స్ లేదా పోస్ట్ ఆఫీస్ లో సేవ్ చేసుకునేలా వారికి భరోసా ఇవ్వాలన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.