Karthika Nair: కేరళ వివాహ సంప్రదాయంలో హీరోయిన్ కార్తీక పెళ్లి.. హాజరైన చిరంజీవి, సినీ ప్రముఖులు..

తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్‌లో.. కేరళ సంప్రదాయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహ వేడకలో మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరోయిన్స్ రాధిక , సుహాసిని, రేవతి, మేనక పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నటి రాధిక తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Karthika Nair: కేరళ వివాహ సంప్రదాయంలో హీరోయిన్ కార్తీక పెళ్లి.. హాజరైన చిరంజీవి, సినీ ప్రముఖులు..
Karthika Nair
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2023 | 4:09 PM

సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె హీరోయిన్ కార్తీక నాయర్ వివాహ వేడుక అంగరంగ వైభవంగ జరిగింది. నవంబర్ 19న ఆదివారం ఉదయం రోహిత్ మేనన్‏తో మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్‌లో.. కేరళ సంప్రదాయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహ వేడకలో మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరోయిన్స్ రాధిక , సుహాసిని, రేవతి, మేనక పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నటి రాధిక తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కార్తీక పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

దక్షిణాది చిత్రపరిశ్రమలో కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కార్తీక. జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ కాకపోయినా.. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత జీవా నటించిన రంగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాల్లో నటించిన కార్తీకకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉండిపోయింది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న కార్తీక.. వ్యాపారరంగంలో రాణిస్తుంది.

Chiranjeevi

Chiranjeevi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు