AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnavi chaitanya: బోల్డ్ సీన్స్‌లో నటించడం పై మాపేరెంట్స్ ఏమన్నారంటే..

మంచి కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్న మొన్నాటి వరకు యూట్యూబ్ లో వీడియోలు, వెబ్ సిరీస్ లు చేసిన వైష్ణవి ఈ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది.

Vaishnavi chaitanya: బోల్డ్ సీన్స్‌లో నటించడం పై మాపేరెంట్స్ ఏమన్నారంటే..
Vaishnavi Chaitanya
Rajeev Rayala
|

Updated on: Jul 17, 2023 | 9:17 AM

Share

ప్రస్తుతం ఎక్కడ చూసిన బేబీ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ సినిమా ప్రస్తుతం యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మంచి కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్న మొన్నాటి వరకు యూట్యూబ్ లో వీడియోలు, వెబ్ సిరీస్ లు చేసిన వైష్ణవి ఈ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమాలో వైష్ణవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో వైష్ణవి ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవి ఢీ గ్లామర్ పాత్రలో కనిపిచింది.

ఇక ఈ మూవీ సక్సెస్ అవ్వడంతో చిత్రయూనిట్ వరుస మీట్స్ తో హంగామా చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ లో నటించడం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బోల్డ్ సీన్స్ లో నటించడం పై ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయాన్ని తెలిపింది.

బస్తీ నుంచి టిక్ టిక్ వీడియోలు చేస్తూ నా టాలెంట్ తో ఎదిగి ఇక్కడ నిలబడ్డాను అని తెలిపింది. నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లు చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాను. పెద్ద హీరోయిన్ అవ్వాలని నేను అనుకోలేదు. సినిమాల్లోకి రావాలి, స్థిరపడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకున్నా అంతే అని తెలిపింది. ఈ సినిమాలో రొమాన్స్‌, లిప్‌లాక్‌ సీన్లలో నటించడం చాలా కష్టం.. ఆ సీన్స్ చేసేటప్పుడు సెట్స్ లో ఎక్కువ మంది లేరు. బేబీ టీమ్ నన్ను చాలా కంఫర్ట్ గా చూసుకున్నారు. విరాజ్ కూడా చాలా ధైర్యాన్ని నింపాడు అని తెలిపింది. బేబీలో సన్నివేశంలో భాగంగానే ఆ సీన్స్ చేశాను.. మాపేరెంట్స్ కూడా అదే అనుకున్నారు. సినిమా చూస్తే ఆ సీన్స్ గుర్తుండవు ఎమోషన్స్ మాత్రమే గుర్తుంటాయి అని చెప్పుకొచ్చింది.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే