Godfather: మెగాస్టార్ మూవీలో సత్యదేవ్ పాత్రకోసం ముందుగా అనుకున్న హీరోలు వీరేనట..
బాస్ ఈస్ బ్యాక్ అంటూ థియేట్సర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతోంది. మలయాళ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇప్పుడు థియేటర్స్ వద్ద సందడి చేస్తోంది. ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత డీలాపడిన ఫ్యాన్స్ కు గాడ్ ఫాదర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి చూపించారు మెగాస్టార్. దాంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంత కాదు బాస్ ఈస్ బ్యాక్ అంటూ థియేట్సర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతోంది. మలయాళ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా సాధించిన విజయం ఎలాంటిదంటే ఒరిజనల్ మూవీకంటే ఇదే బాగుంది అంటున్నారు చూసిన వారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే లేడీ సూపర్ స్టార్ నయన తార చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించింది.
అలాగే ఇతర ముఖ్య పాత్రల్లో సత్యదేవ్ , సునీల్ , అనసూయ నటించారు. అయితే ఈ సినిమాలో సత్య దేవ్ నటించిన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అయితే ముందుగా ఈ పాత్ర కోసం కొంతమంది నటులను అనుకున్నారట కానీ రకరకాల కారణాల చేతవారు సెట్ అవ్వలేదట. గాడ్ ఫాదర్ సినిమాలో చాలా మార్పులు చేశారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా దర్శకుడు మోహన్ రాజా చాలా మార్పులు చేశారు. ఈ క్రమంలోనే సత్య దేవ్ పాత్రను కూడా మార్చేశారట.. సత్య దేవ్ పాత్రకు విలనిజాన్ని జోడించారు మోహన్ రాజా.
అయితే ఈ పాత్ర కోసం ముందుగా తమిళ నటుడు అరవింద్ స్వామిని అనుకున్నారట. అయితే ఆయన ఇతర సినిమాలతో బిజీగా ఉంటడంతో ఆయన నో చెప్పారట. ఆతర్వాత టాలీవుడ్ హీరో గోపీచంద్ ను కూడా సంప్రదించారని టాక్ వినిపించింది. అయితే హీరోగా చేస్తున్న సమయంలో విలన్ గా నటించడం ఇష్టం లేక నో చెప్పారట . అలాగే మరికొంతమంది యంగ్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఫైనల్ గా సత్యదేవ్ ను సంప్రదించారట. అలా ఈ అవకాశం సత్యదేవ్ ను వరించింది. అయితే మెగాస్టార్ చిరంజీవినే డైరెక్ట్ గా సత్య దేవ్ పేరు చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఒప్పించారట. ఈ విషయాన్నీ ఇప్పటికే పలు ఇంట్రవ్యూల్లో చెప్పారు చిరు.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




