Sai Durgha Tej: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు.. మావయ్య నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సాయి దుర్గ తేజ్

|

Nov 21, 2024 | 6:09 PM

మెగా మేనల్లుడు సుప్రీం హీరో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తయ్యింది. అతను హీరోగా నటించిన పిల్లా నువ్వులేని జీవితం సినిమా రిలీజై పదేళ్లవుతోంది. ఈ సందర్భంగా తన మావయ్య, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశాడు మెగా హీరో.

Sai Durgha Tej: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు.. మావయ్య నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సాయి దుర్గ తేజ్
Sai Durgha Tej,pawan Kalyan
Follow us on

ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు హీరో సాయి దుర్గ తేజ్ ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముగ్గురు మావయ్యలు ఉన్నప్పటికీ పవన్ అంటే సాయికి ప్రత్యేకమైన ప్రేమ, అనుబంధం. ఈ విషయాన్ని అతనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక సాయిని కూడా కంటికి రెప్పలా చూసుకుంటాడు పవన్. ముఖ్యంగా సాయికి యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తాను ఏ విధంగా ఆవేదన చెందానో ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు పవన్. ఇక వీరిద్దరూ కలిసి బ్రో అనే సినిమాలో హీరోలుగా నటించారు. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలోకి సాయి అడుగు పెట్టి పదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా తన మావయ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు సాయి దుర్గ తేజ్. ఇదే సమయంలో తన మేనల్లుడికి ఒక స్పెషల్ గిఫ్ట్ అందించారు పవన్. సావర తెగలు చేసిన స్పెషల్ పెయింటింగ్ ను సాయికి బహుమతిగా అందించారు. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు మెగా హీరో.

‘మామయ్య పవన్ కల్యాణ్ దగ్గర నుంచి అందుకునే దీవనెలతో పాటు ఆయన ఇచ్చే ప్రతి గిఫ్ట్ ఎంతో ప్రత్యేకం. ఇప్పుడు నేను అందుకున్న ఆర్ట్ వర్క్స్ సావర తెగలు తయారుచేసింది. ఏపీ లేపాక్షి షోరూం నుంచి ఈ పెయింటింగ్స్ తీసుకొచ్చారు. ఏపీలోని ఉత్తరాంధ్ర ఏజెన్సీకి చెందిన ఈ సావర ట్రైబ్ నేచురల్ కలర్స్ తో ఈ పెయింటింగ్స్ గీస్తారు. అయితే శతాబ్దాల చరిత్ర ఉన్న సావర తెగల కళ క్రమంగా అంతరించిపోతోంది. వీరి ఉనికిని కాపాడాలంటే మనమంతా ఈ సావర తెగలు తయారుచేసిన పెయింటింగ్స్, ఇతర అలంకరణ వస్తువులు కొనుగోలు చేయాలి. వారిని ఆర్థికంగా ప్రోత్సహించాలి’.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ తో సాయి దుర్గ తేజ్..

అందరికీ ఇవే కానుకలు..

‘నాకే కాదు పవన్ కల్యాణ్ మావయ్య ఎవరికైనా బహుమతిగా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఈ కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలతో పాటు సావర తెగల పెయింటింగ్స్ ను ఇస్తారు. మనం కూడా ఆ కృషిని, స్ఫూర్తిని కొనసాగించాలి. లేపాక్షి షోరూం వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లోనూ ఈ కళాకృతులు కొనుగోలు చేసుకోవచ్చు’ అని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు.

వీడియో ఇదిగో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.