AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం.. ప్రగాఢ సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

సుదీప్ కన్నడ సినీరంగంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన అతను బిగ్ బాస్ తో బుల్లితెర ఆడియెన్స్ ను కూడా అలరిస్తున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి, నాని కాంబోలో వచ్చిన ఈగ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు సుదీప్. అలాగే సైరా నరసింహారెడ్డి, బాహుబలి సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రలు పోషించాడు.

Pawan Kalyan: కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం.. ప్రగాఢ సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Kichcha Sudheep, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Oct 20, 2024 | 7:00 PM

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ (86) ఆదివారం (అక్టోబర్ 20) ఉదయం కన్నుమూశారు. అనారోగ్యానికి తోడు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె బెంగళూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తల్లి మరణంతో సుదీప్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కిచ్చా సుదీప్ తల్లి మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సరోజ సంజీవ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కిచ్చా సుదీప్ కు ధైర్యం చెప్పారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సైతం సంతాపాన్ని ప్రకటించారు. ‘ప్రముఖ నటులు కిచ్చా సుదీప్ మాతృ మూర్తి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని సుదీప్ గారు తెలిపారు. మాతృ వియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. సుదీప్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అంటూ పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

కిచ్చా సుదీప్ తల్లి వృద్ధాప్య సంబంధిత సమస్యలతో పాటు అనారోగ్యంతోనూ బాధపడుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్సకు స్పందించకపోవడంతో ఉదయం 7 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. సరోజు సొంతూరు మంగళూరు. తుళు వారి మాతృభాష. ఈ విషయం గురించి సుదీప్ బిగ్ బాస్ షోలో చెప్పుకొచ్చాడు. కాగా సరోజా భౌతిక కాయాన్ని 11 గంటలకు జెపి నగర్ నివాసానికి తీసుకొచ్చారు. ఆతర్వాత సుదీప్ ఇంటి దగ్గర ఆఖరి దర్శనానికి ఏర్పాట్లు కూడా చేశారు.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ ట్వీట్..

సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.