AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty: అనుష్క ఈజ్ బ్యాక్.. కుర్ర హీరోయిన్లకు టెన్షన్ పెట్టిస్తోన్న స్వీటీ.. ఇలా ఎప్పుడు మారిందబ్బా

గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. అయితే కంటెంట్.. రోల్ ఇంపార్టెన్స్ బట్టి ఫిట్ నెస్ విషయంలో సాహసాలు చేసేందుకు ముందుంటుంది అనుష్క. గతంలో జీరో సైజ్ సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆ తర్వాత వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది.

Anushka Shetty: అనుష్క ఈజ్ బ్యాక్.. కుర్ర హీరోయిన్లకు టెన్షన్ పెట్టిస్తోన్న స్వీటీ.. ఇలా ఎప్పుడు మారిందబ్బా
Anushka Shetty
Rajitha Chanti
|

Updated on: Mar 12, 2024 | 9:02 AM

Share

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారలలో అనుష్క శెట్టి ఒకరు. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్. అరుంధతి సినిమాతో జేజమ్మ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ ప్రాజెక్ట్స్ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది. చాలా కాలంపాటు అటు ఇండస్ట్రీలో.. ఇటు సోషల్ మీడియాలో చాలా సైలెంట్ అయ్యింది. ఇక ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. అయితే కంటెంట్.. రోల్ ఇంపార్టెన్స్ బట్టి ఫిట్ నెస్ విషయంలో సాహసాలు చేసేందుకు ముందుంటుంది అనుష్క. గతంలో జీరో సైజ్ సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆ తర్వాత వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. ఇలాంటి సాహాసాలు చేయడం అనుష్కకు కొత్తేమి కాదు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి అభిమానులను ఆశ్చర్యపరిచింది స్వీటీ.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయ్యింది జేజమ్మ. ఇన్నాళ్లుగా ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. కానీ తెలుగులో కాదు.. మలయాళంలో ఓ సినిమాలో నటిస్తుంది. సోమవారం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది అనుష్క. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అనుష్కను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లుగా బొద్దుగా కనిపించిన అనుష్క.. ఇప్పుడు బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. దీంతో మేము చూస్తున్నది అనుష్కనేనా ?.. స్వీటీ ఎప్పుడు ఇలా మారిపోయింది ?.. ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మలయాళంలో అనుష్క తొలి చిత్రం ఇదే. ఇందులో జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్ కటనార్. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కాటమమత్ కటనార్ కథల ఆధారంగా శ్రీగోకులం మూవీస్ బ్యానర్ పై గోకులం గోపాలన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అరుందతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన అనుష్క.. ఇప్పుడు కటనార్ సినిమా ద్వారా భిన్నమైన నటనతో అలరించనుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నారు. ముప్పైకి పైకి భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?